Schools and Colleges : ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో తొలి రోజు హాజరు ఇంతే .. కొన్ని చోట్ల అయితే
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో తొలిరోజు 32.47 శాతం విద్యార్థులు హాజరయ్యారు. పలు చోట్ల అమావాస్య కారణంగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు తెరవకుండా ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన కొనసాగించారు. మిగిలిన చోట్ల కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పని సరిచేయగా.. విద్యార్థుల హాజరే స్వల్పంగా ఉండటంతో బెంచీకి ఒకరు, ఇద్దరు చొప్పునే కూర్చున్నారు. సిద్దిపేట, అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 51.17 శాతం, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 19.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. అత్యధిక విద్యార్థుల సంఖ్య కలిగిన హనుమకొండ మర్కజీ పాఠశాలలో 1,108 మంది విద్యార్థులకు 212 మంది, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 440 మందికి కేవలం ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్‌లో పదో తరగతిలో కేవలం నలుగురు విద్యార్థినులు మాత్రమే హాజరయ్యారు. 8, 9, 10 తరగతుల్లో కలిపి మొత్తం 507 మంది విద్యార్థినులు ఉండగా 29 మంది వరకు హాజరయ్యారు. జనగామ రైల్వే ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు హాజరయ్యారు.
Telangana: బడి బాటలో పిల్లలు.. బదిలీల బాధలో టీచర్లు..ఇంతకి స్కూల్స్ జరిగేనా..?
TS High Court: కాలేజీలు మూసి.. స్కూళ్లు తెరుస్తారా..?
Telangana: స్కూల్స్ సెలవులు పొడిగింపు పైనే విద్యాశాఖ దృష్టి.. ఇప్పట్లో కష్టమే..?
విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవకాశం..ఎందుకంటే..?
Telangana: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్, కాలేజీలు ప్రారంభం.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
Holidays: ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్, కాలేజీలు మూసివేత.. అలాగే పరీక్షలు వాయిదా..!
Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలు సెలవులు
Schools: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం.. అయితే ఈ తరగతుల వాళ్లకు మాత్రం సెలవులే..
Covid effect : మా పిల్లల్ని బడికి పంపించేది లేదు..కారణం ఇదే..?
Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?
Holidays: జూనియర్ కాలేజీలకు సెలవులు
Omicron Effect: రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలకు సెలవులు..కారణం ఇదే..