Skip to main content

Telangana Teachers : ఈ ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్‌.. 12 నెలల జీతంతో పాటు ఆరు నెలల సెలవులు.. అలాగే క్రమబద్దీకరణ కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కేసీఆర్ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ దినోత్సవం కానుకగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరీస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Teachers day, 567 Contract Teachers ,16 Years of Service, Social Welfare Schools

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించినట్టుగానే గురుకుల ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 11ను జారీ చేసింది.

☛ 6,612 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే.. కాంట్రాక్ట్ టీచ‌ర్ల‌ల‌ను..

12 నెలల జీతంతో పాటు ఆరు నెలల సెలవులను కూడా..

teacher jobs news in telugu

సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను కూడా ప్రకటించింది ప్రభుత్వం. సాంఘిక గురుకుల ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

☛ TET/DSC 2023: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

పీఆర్సీని కూడా..
2007లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మొత్తంగా 567 మంది ఉపాధ్యాయులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించింది. అందులో స్టాఫ్‌ నర్సులతోపాటు, లైబ్రేరియన్లు కూడా ఉన్నారు. అయితే, రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పని చేసినప్పటికీ వారికి పూర్తి స్థాయిలో వేతనాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం గురుకులాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్‌ ఉపాధ్యాయులతోపాటు పీఆర్సీని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేర‌కు గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

 ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

☛ TET/DSC 2023: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

☛ TS TET 2023 Bitbank: అన్ని సబ్జెక్టులు... చాప్టర్ల వారీగా ప్రాక్టీస్ క్వశ్చన్స్... ఇంకెందుకు ఆలస్యం ప్రాక్టీస్ చేయండి!

☛ TS TET 2023: టెట్‌ షెడ్యూల్‌... పరీక్ష విధానం.. అర్హత మార్కులు ఇలా..

 చదవండి: టెట్‌ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | 2022 ప్రివియస్‌ పేపర్స్

☛ TS TET 2022 Paper-1 Question Paper & Key

☛ TS TET 2022 Paper-2 Final Key: టీఎస్ టెట్ పేప‌ర్‌-2 ఫైన‌ల్‌ 'కీ' విడుద‌ల‌.. ఈ సారి మాత్రం..

Published date : 05 Sep 2023 02:26PM

Photo Stories