Skip to main content

TS TET 2023 Bitbank: అన్ని సబ్జెక్టులు... చాప్టర్ల వారీగా ప్రాక్టీస్ క్వశ్చన్స్... ఇంకెందుకు ఆలస్యం ప్రాక్టీస్ చేయండి!

తెలంగాణ ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయిన TS TET 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తెలంగాణ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం DSC/TRT పరీక్ష రాయడానికి అర్హులు.
TS TET 2023 Practice Tests

TET స్కోర్ ఇప్పుడు మొత్తం జీవితకాలం చెల్లుతుంది. కాబట్టి, ఒకసారి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు, నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడు TRT/DSC పరీక్షలు రాయవచ్చు. ప్రస్తుత విద్యా సంవ‌త్సరం చివ‌రి ఏడాది చ‌దివే అభ్యర్థులూ అర్హులే. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు.

ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరించనున్నారు. సెప్టెంబర్‌ 15న పరీక్ష, 27న ఫలితాలు విడుదల కానున్నాయి. పేప‌ర్‌-1 మొత్తం 150 మార్కులు, పేప‌ర్‌-2 150 మార్కుల‌కు ఉంటుంది. 

TS TET 2023 సబ్జెక్ట్ వారీగా బిట్‌బ్యాంక్

Sakshieducation.com ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణుల సహాయంతో TS TET బిట్‌బ్యాంక్‌ను సిద్ధం చేసింది. అన్ని సబ్జెక్టులకు ప్రాక్టీస్ ప్రశ్నలు అందుబాటులో ఉన్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు తమ ఖాళీ సమయంలో ప్రాక్టీస్ చేయవచ్చు. కింది లింక్ను క్లిక్ చేసి బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ చేయొచ్చు

TS TET 2023 Notification :  డీఎస్సీపై క్లారిటీ..!

12 వేల టీచర్‌ పోస్టులను..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఓ అంచనా కాగా.. ప్రభుత్వం మాత్రం 12 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తామని తెలిపింది. చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. పైగా గత ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టారు. కొన్ని పాఠశాలల్లో ఎస్‌జీటీలను ఉన్నత తరగతులకు పంపుతున్నారు. ఇందులో చాలామంది స్కూల్‌ అసిస్టెంట్లకు అర్హత ఉన్నా, పదోన్నతులు లేకపోవడంతో ఫలితం దక్కడం లేదు. పదోన్నతులు లేకపోవడంతో బదిలీలు జరగడం లేదు.

Published date : 10 Aug 2023 04:14PM

Photo Stories