TS TET 2023: టెట్ ఫలితాలు విడుదల తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు.
ఇందుకు కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు విడుదలవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. 27వ తేదీన తుది ‘కీ’ తో పాటు ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. టెట్ పరీక్ష పేపర్–1కు 2,69,557 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 2,26,744 (84.1 శాతం) మంది పరీక్ష రాశారు.
చదవండి: NSS Day In College: విద్యార్థులు సమాజసేవ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి
పేపర్–2కు 2,08,498 మంది దరఖాస్తు చేస్తే, 1,89,963 మంది (91.11 శాతం) పరీక్ష రాశారు. వచ్చే నెల జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కి టెట్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసే వీలుంది. ఈ కారణంగా టెట్ ఫలితాలను ఆలస్యం చేయకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Published date : 26 Sep 2023 11:30AM