TET Notification 2024: 11,602 టీచర్ పోస్ట్‌లు.. టెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, సిలబస్ అంశాలు, ప్రిపరేషన్ గైడెన్స్..
- టీఎస్ టెట్–2024 దరఖాస్తుప్రక్రియ ప్రారంభం
- మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు
- టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌కు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి
- నిర్దిష్ట వ్యూహాలతో విజయం సాధించే అవకాశం
ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం–టీచర్ రిక్రూ ట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ)కు హాజరు కావాలంటే.. బీఈడీ, డీఈడీలతోపాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో ఉత్తీర్ణత తప్పనిసరి. అప్పుడే టీఆర్‌టీకి దరఖాస్తుకు అవకాశం లభిస్తుంది. తాజాగా టీ ఆర్‌టీకి దరఖాస్తు చేసుకునేందుకు మార్గంగా టెట్ ను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
20 శాతం వెయిటేజీ
టీచర్ పోస్ట్‌ల భర్తీలో టెట్ స్కోర్‌కు వెయిటేజీ కూడా కల్పిస్తారు. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌కు 80 శాతం; టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. డీఈడీ, బీఈడీ అర్హతతో నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో రెండు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్–1, పేపర్–2.
పేపర్–1 అర్హతలు
- పేపర్–1ను ఒకటి నుంచి అయిదో తరగతి వర కు బోధించే ఎస్‌జీటీ పోస్ట్‌ల అభ్యర్థులకు నిర్వహిస్తున్నారు.
- ఇంటర్మీడియెట్/తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్/రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణులవ్వాలి.
చదవండి: Telangana TRT & DSC 2024 Notification: 11,062 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఎస్‌ఏ..పేపర్–2
- ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అభ్యర్థులకు టెట్ పేపర్–2ను నిర్వహిస్తారు.
- బీఏ/బీఎస్సీ/బీకాంలలో కనీసం 50 శాతం మా ర్కులతో ఉత్తీర్ణతతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యు కేషన్(బీఈడీ) లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేష న్(స్పెషల్ ఎడ్యుకేషన్) తదితర అర్హతలు ఉండాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యా ర్థులు కూడా టెట్ పేపర్లకు హాజరు కావచ్చు.
150 మార్కులకు టెట్ పేపర్–1
టెట్ పేపర్–1ను అయిదు విభాగాల్లో 150 ప్రశ్న లు–150 మార్కులకు నిర్వహిస్తారు. అవి.. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి (30 ప్రశ్నలు– 30 మార్కులు), లాంగ్వేజ్–1(30 ప్రశ్నలు–30 మా ర్కులు), లాంగ్వేజ్–2(30 ప్రశ్నలు–30 మార్కు లు); మ్యాథమెటిక్స్(30 ప్రశ్నలు–30 మార్కులు); ఎన్విరా న్‌మెంటల్ స్టడీస్(30 ప్రశ్నలు–30 మార్కు లు) ఉంటాయి. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. లాంగ్వేజ్–1 సబ్జెక్ట్ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్న డ, మరాఠి, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు. లాంగ్వేజ్–2 విభాగంలో ఇంగ్లిష్ సబ్జెక్ట్ ఉంటుంది.
పేపర్–2 స్వరూపం
టెట్ పేపర్–2 కూడా 150 ప్రశ్నలు–150 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా జరుగుతుంది. ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి 30 ప్రశ్నలు–30 మార్కులకు, లాంగ్వేజ్ 1, 30 ప్రశ్నలు–30 మార్కులకు, లాంగ్వేజ్ 2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు–30 మార్కులకు, సంబంధిత సబ్జెక్ట్ (మ్యాథ్స్ అండ్ సైన్స్/ సోషల్ స్టడీస్) 60 ప్రశ్నలు–60 మార్కులకు ఉంటాయి.
కనీస అర్హత నిబంధన
టెట్ పేపర్–1, పేపర్–2లలో అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు పొందాలనే నిబంధన విధించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులు, బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 2024, మార్చి 27 – ఏప్రిల్ 10
- హాల్ టికెట్ డౌన్‌లోడ్: మే 15 నుంచి
- టెట్ తేదీలు: మే 20–జూన్ 3 (పేపర్ 1 ఉదయం 9 నుంచి 11:30 వరకు; పేపర్–2 మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు)
- ఫలితాల వెల్లడి: 2024, జూన్ 12
- వెబ్‌సైట్: https://tstet2024.aptonline.in/tstet/
చదవండి: Non Teaching Jobs in CBSE: సీబీఎస్‌ఈలో 118 గ్రూప్ ఎ, బి, సి పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఉత్తమ స్కోర్ సాధించేలా
పేపర్–1 ప్రిపరేషన్ ఇలా
పేపర్–1కు సంబంధించి ముఖ్యంగా.. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజిలో బోధన, లెర్నింగ్‌కు సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీపై ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ప్రధా నంగా శిశువు సైకాలజీకి సంబంధించిన అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలను చదవాలి. సైకాలజీ అంశాలను చదివే టప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు–సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్త లు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. ఇక పెడగాజి అంటే బోధన శాస్త్రం. ఇందులో సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం– నాయకత్వం–గైడెన్స్–కౌన్సెలింగ్ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. పెడగాజిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేయాలి.
లాంగ్వేజ్–1,2
పేపర్ 1గా అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠి, తమిళం భాషలను ఎంచుకోవచ్చు. సదరు సబ్జెక్ట్‌ను పదో తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. లాంగ్వేజ్–2లో ఇంగ్లిష్ పేపర్ ఉంటుంది. ఈ రెండు పేపర్లు పూర్తిగా ఆయా భాషల్లో నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధన పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతోపాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డెరైక్ట్, ఇన్ డెరైక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
ఒకటి నుంచి అయిదో తరగతి స్థాయి వరకు ప్రశ్నలు ఉంటాయి. ఆయా సబ్జెక్టుకు సంబంధించి మొత్తం 30 ప్రశ్నల్లో.. 24 ప్రశ్నలు కంటెంట్, 6 ప్రశ్నలు పెడగాజిపై ఉంటాయి. ఎన్విరాన్‌మెంటల్ పేపర్‌లో సైన్స్, తెలంగాణ నుంచి ప్రశ్నలు తప్ప నిసరిగా ఉంటున్నాయి. ప్రస్తుతం టెట్‌కు హాజర య్యే అభ్యర్థులు తెలంగాణ ప్రాముఖ్యం ఉన్న అంశాలను ప్రత్యేక దృష్టితో చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.
పేపర్–2 ప్రిపరేషన్
- సైన్స్: ఈ విభాగంలో మార్కుల కోసం మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు ఔపోసన పట్టాలి. గత టెట్‌లో ఈ విభాగంలో ప్రశ్నలు కాసింత క్లిష్టంగానే ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్ వంటి వాటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి.
- సోషల్ స్టడీస్: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చదవాలి. వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, నదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా సివిక్స్, ఎకనామిక్స్ అంశాలను సమకాలీన అంశాలతో అప్‌డేట్ చేసుకుంటూ అధ్యయనం చేయాలి.
- మ్యాథమెటిక్స్: ఈ సబ్జెక్ట్‌లోనూ ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు మ్యాథమెటిక్స్ పుస్తకా లను అధ్యయనం చేయాలి. ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, కో–ఆర్డినేట్ జామెట్రీ, అల్జీబ్రా, కాలిక్యులస్ వంటి కీలక సబ్జెక్ట్‌లను కాన్సెప్ట్‌ల ను అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- TS TET Notification 2024
- Teacher Jobs in Telangana
- Telangana Education Department
- TRT Notification
- ts tet 2024
- TS TET advantages
- TS TET Exam Eligibility
- TS TET Exam Pattern
- TS TET Exam Syllabus
- TS TET Exam Preparation Tips
- Telangana State Education Department
- TS TET Exam Weightage
- Child Development and Pedagogy
- Language
- Mathematics
- Environmental Studies
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications