తెలంగాణ టెట్-2025 పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ (TS TET KEY 2025) నేడు(జనవరి 24)న విడుదల కానుంది. ఈ ఏడాది జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 2,05,278 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఈ సంవత్సరం పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgtet2024.aptonline.in/tgtet/ ద్వారా ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు ప్రిలిమినరీ కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా, వాటిని కీ విడుదల చేసిన తేదీ నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను తెలియజేయవచ్చు.
ఫిబ్రవరి రెండో... లేదా మూడో వారంలో టెట్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే టెట్ ఫలితాలు విడుదల అనంతరం 6000 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయనున్నారు. అలాగే ఈ డీఎస్సీ పరీక్షలు కూడా ఏప్రిల్‌లో జరగనున్నాయి.