High Tension at TET Exam : టెట్ పరీక్షలో గందరగోళం.. సాయంత్రం వరకు నిలిచిపోయిన పరీక్ష.. చివరికి..!!

సాక్షి ఎడ్యుకేషన్: జనవరి 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ పరీక్షలు ఈనెల 20వ తేదీన పూర్తి కానున్నాయి. ప్రస్తుతం, ఇంకా టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, నిన్న అంటే, శనివారం.. జనవరి 12వ తేదీన శంషాబాద్‌లోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన టెట్ సెంటర్‌లో గందరగోళం నెలకొంది. రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తుండగా, తొలి సెషన్ విజయవంతంగా పూర్తి అయ్యింది. కాని, రెండో సెషన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు టెట్ అభ్యర్థులు. వివరాల్లోకి వెళ్తే..
PG One Time Exam Schedule: ‘పీజీ వన్‌టైం’ పరీక్షల షెడ్యూలు విడుదల
750లో 150 మంది..
శనివారం, జనవరి 12వ తేదీన శంషాబాద్‌లోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ కేంద్రంగా టెట్ పరీక్షను నిర్వహించారు. అయితే, రెండో సెషన్‌లో మొత్తం 750 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. వారిలో 467 మంది హాజరయ్యారు.రెండో సెషన్‌లో పేపర్-2 గణితం, సైన్స్(తెలుగు మీడియం) పరీక్ష నిర్వహించారు.
Gurukul Admissions : గురుకుల విద్యాలయాల్లో ఖాళీలు.. ముఖ్యమైన వివరాలు ఇవే..!!
టెట్ బృందం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష సాయంత్రం 4.30 గంటల వరకు జరగాల్సి ఉంది. కాని, పరీక్ష ప్రారంభమైన కాసేపటికి ఉన్నట్లుగా సర్వర్ డౌన్ అయింది. ఇక దీంతో చాలామంది వారి పరీక్షను పూర్తి చేసిన, దాదాపు 150 మంది అభ్యర్థులు ఇంకా వారి పరీక్షను పూర్తి చేయలేదు. సర్వర్ డౌన్ కావడంతో పరీక్ష నిలిచిపోయింది.
10 నిమిషాల్లోనే అంటూ..
కేంద్రం బయట అభ్యర్థుల కుటుంబ సభ్యులు వారి కోసం ఎదురు చూస్తున్నారు. కాని, వారికి సమస్య ఉందని తెలుసుకున్న 10 నిమిషాల్లో సెట్ అవుతుందని అధికారులు చెప్పడంతో వారు తీవ్ర ఆందోళనకు దిగారు. కేంద్రం వద్దే వారంతా ఆందోళన చేపట్టారు. కేంద్రం లోపల ఉన్న అభ్యర్థులు సైతం ఆందోళన చెందారు. సాయంత్రం 4 30 గంటలకు పూర్తి కావాల్సిన పరీక్ష సమయం మించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో సాయంత్రం 6 గంటల వరకు శ్రమించగా ఫలితంగా అప్పుడు సమస్య ముగిసి, మిగిలిన అభ్యర్థులు కూడా పరీక్షను పూర్తి చేసుకున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- TET Exam
- ts tet 2025 exam updates
- january 2025
- teachers recruitments in telangana
- Government Teacher Jobs
- high tension at tet exam center
- telangana tet exam 2025
- protest for tet candidates
- technical issue
- exam time extension
- tet exam candidates
- two hours delay
- ts tet exam schedule 2025
- january 12th
- extension of exam time due to technical problems
- Teachers Eligibility Test
- Teachers Eligibility Test in Telangana 2025
- Teachers Eligibility Test in Telangana 2025 latest update in telugu
- Education News
- Sakshi Education News