TS TET 2025 Answer key Released : తెలంగాణ టెట్ ఆన్సర్ కీ విడుదల.. ఫలితాల ప్రకటన వచ్చేసింది..

టెట్ ఆన్సర్ కీని విడుదల
ఈ సంవత్సరం పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgtet2024.aptonline.in/tgtet/ ద్వారా ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు ప్రిలిమినరీ కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా, వాటిని కీ విడుదల చేసిన తేదీ నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను తెలియజేయవచ్చు.
TS TET 2025 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
- అధికారిక వెబ్‌సైట్ https://tgtet2024.aptonline.in/tgtet/ ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో TS TET ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి.
- పేపర్ 1 లేదా పేపర్ 2 సబ్జెక్టులు కనిపిస్తాయి. కావల్సిన కీ పేపర్‌పై డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది
- ప్రిలిమినరీ కీ ఆప్షన్ పై క్లిక్ చేయగానే 'కీ' ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
టెట్‌లో అర్హత సాధించాలంటే..
డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు టెట్‌లో అర్హత తప్పనిసరి అన్న విషయం తెలిసిందే.
జనరల్ కేటగిరీ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఉత్తీర్ణత 40 శాతంగా ఉండాలి.
టెట్ ఫలితాలు ఎప్పుడంటే..
ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అలాగే టెట్ ఫలితాలు విడుదల అనంతరం 6000 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయనున్నారు. అలాగే ఈ డీఎస్సీ పరీక్షలు కూడా ఏప్రిల్‌లో జరగనున్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- TS TET
- TG TET 2025
- TG TET 2025 Notification
- TG TET 2025 Important Dates
- TG TET 2025 Exam Dates
- Telangana TET Key
- Telangana TET Results 2025
- Teacher Eligibility Test
- Results 2025
- TS TET 2025 Key Released Date
- TS TET 2025 Key Released Date and Time
- Telangana TET-2025 Answer Key Released
- Check TS TET Key and Raise Objections
- Deadline for TS TET Key Objections