Skip to main content

TET Exam: టెట్‌ పరీక్ష ప్రశాంతం.. ఇంత మంది హాజరు

ts tet exam 2023 completed

వికారాబాద్‌ అర్బన్‌: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన టెట్‌ ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్‌ నారాయణరెడి, డీఈఓ రేణుకాదేవి తెలిపారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో, అలాగే సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో జరిగిన పేపర్‌ –1 పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఓఎంఆర్‌ షీట్‌, పేపర్‌ కోడ్‌పై ఆరా తీశారు. పరీక్ష పేపర్లను బందోబస్తు మధ్య తరలించాలని ఆదేశించారు. జిల్లాలో టెట్‌ పేపర్‌ –1 పరీక్షకు 5,765 మంది హాజరు కావాల్సి ఉండగా 5,160 మంది వచ్చారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌ –2 పరీక్షకు 3,846 మందికి గాను 3,689మంది హాజరైనట్లు తెలిపారు.

చదవండి: ‘TET’ పరీక్ష ప్రశాంతం.. ఇంత మంది హాజరు

ఇబ్బందులు పడిన అభ్యర్థులు
జిల్లా కేంద్రంలో టెట్‌ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఇబ్బందులు తప్పలేదు. పరీక్ష కేంద్రాల వద్ద సెల్‌ఫోన్‌, వెంట తెచ్చుకున్న బ్యాగులు డిపాజిట్‌ చేసేందుకు ఎలాంటి కౌంటర్లు ఏర్పాట్లు చేయలేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి లగేజీతో వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. అక్కడ ఉన్న సిబ్బందిని డిపాజిట్‌ చేసుకోవాలని వేడుకున్నా లాభం లేకపోయింది.

తాండూరులో..
తాండూరు టౌన్‌: తాండూరులో టెట్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఒకే సెంటర్‌లో పరిమితికి మించి అభ్యర్థులు పరీక్ష రాయకూడదన్న నిబంధన కారణంగా ఐదుగురు అభ్యర్థుల కోసం అధికారులు ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పేపర్‌ –1 పరీక్షకు 485 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 23 మంది గైర్హాజరైనట్లు తాండూరు ఎంఈవో వెంకటయ్య గౌడ్‌ తెలిపారు.

చదవండి: TS TET 2023 Exam: ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష

Published date : 16 Sep 2023 03:14PM

Photo Stories