కరీంనగర్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సెప్టెంబర్ 15న జిల్లాలో ప్రశాంతంగా జరి గింది. పేపర్–1కు 9,646మంది దరఖాస్తు చేసుకోగా 7,811మంది హాజరయ్యా రు.
‘TET’ పరీక్ష ప్రశాంతం.. ఇంత మంది హాజరు
పేపర్–2కు 8,836 మందికి 8,191మంది హాజరయ్యారు. మొత్తంగా 18,482 మందికి 16,002 మంది పరీక్షలకు హాజరు కాగా 2,480 మంది గైర్హాజరయ్యా రు. పరీక్షను జిల్లావ్యాప్తంగా 79పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. రాష్ట్ర పరిశీలకురాలు విజయలక్ష్మిభాయి ఐదు పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసినట్లు డీఈఓ జనార్దన్‌రావు తెలిపారు. పరీక్షలు రాసేందుకు వచ్చిన అభ్యర్థులు సెంటర్లపేర్లు సరిగ్గా తెలియక ఆయోమయానికి గురయ్యారు.
TS TET - 2023 Question Paper with key - Paper 1 | Paper 2 (Held on 15.09.2023)
సవరన్ స్కూల్ సెంటర్లు నాలుగు ఉండగా.. స్కూల్ కోడ్ సరిగ్గా చూసుకోక ఒక స్కూల్ వచ్చి మరోస్కూల్‌కు పరుగెత్తడం కనిపించింది. కొత్తపల్లిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా జగిత్యాల వైపువెళ్లే బస్సులు రూట్ మార్చడంతో సిటీలోని జగిత్యాల రోడ్డులో ఉన్న పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు అభ్యర్థులు ఇక్కట్ల పాలయ్యారు.