Skip to main content

TS TET Results: టెట్‌లో తగ్గిన రిజల్ట్‌.. 2023లో టెట్‌ ఫలితాలు ఇలా...

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సెప్టెంబ‌ర్ 15న జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలుసెప్టెంబ‌ర్ 27న‌ విడుదలయ్యాయి.
TS TET Results
టెట్‌లో తగ్గిన రిజల్ట్‌.. 2023లో టెట్‌ ఫలితాలు ఇలా...

టెట్‌ రెండు పేపర్లకు కలిపి 4,13,629 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా వారిలో 1,11,562 మంది అర్హత పొందారు. పేపర్‌–1ను 2,23,582 మంది రాస్తే 82,489 (36 .98%)మంది అర్హత పొందగా పేపర్‌–2లో మేథ్స్, సైన్స్‌ సబ్జెక్టులను 1,01,134 మంది రాస్తే 18,874 మంది (18.66%), సోషల్‌ స్టడీస్‌సబ్జెక్టును88,913 మంది రాస్తే 10,199 మంది (11.47%) అర్హత సాధించారు. పేపర్‌–2లో 1,90, 047 మందికి గాను 29,073 (15.30%) మంది అర్హత పొందారు. టెట్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌  https://cgg.gov.inలో తుది ‘కీ’తోపాటు ఫలితాలు అందుబాటులో ఉన్నాయని టీఎస్‌ టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.  

పడిపోయిన ఫలితాలు...: ఉమ్మడి రాష్ట్రంలో 2011లో టెట్‌ నిర్వహించగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి ఇప్పటి వరకూ ఐదుసార్లు పరీక్ష జరిగింది. ఇప్పటికే దాదాపు 3.5 లక్షల మంది టెట్‌ అర్హులు రాష్ట్రంలో ఉన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది టెట్‌ ఫలితాలు దారుణంగా పడిపోయాయి. సాధారణంగా పేపర్‌–1లో 2022లో మినహా అంతకు ముందు రెండేళ్లలో 50 శాతానికిపైగా రిజల్ట్‌ వచ్చింది. పేపర్‌–2లో మొదట్నుంచీ రిజల్ట్‌ తగ్గుతున్నా ఈసారి అతితక్కువగా 15.30 శాతమే నమోదైంది.

చదవండి: TS TET Results 2023 Released : టీఎస్ టెట్‌-2023 ఫలితాలు విడుద‌ల‌.. ఒకేఒక్క‌ క్లిక్‌తో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో రిజ‌ల్ట్స్ చెక్ చేసుకోండిలా..

గతేడాది ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు ఇవ్వడం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామనే ప్రకటనతో అభ్యర్థులు కోచింగ్‌ కేంద్రాలకు వెళ్లి మరీ టెట్‌కు సన్నద్ధమయ్యారు. ఈసారి టీఆర్టీ నోటిఫికేషన్‌ విడుదల చేసినా పోస్టులు తక్కువగా ఉండటం, రోస్టర్‌ విధానం తర్వాత కొన్ని జిల్లాల్లో ఏమాత్రం ఖాళీలు లేకపోవడంతో ఎక్కువ మంది టెట్‌కు ప్రిపేర్‌ కాలేదు. 

టీఆర్టీ దరఖాస్తుకు అర్హులు 

తాజాగా టెట్‌ ఉత్తీర్ణులు ప్రస్తుతం ప్రభుత్వం నియమించే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్‌ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితాలు వెల్లడవ్వడంతో ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలు కూడా ఆలస్యం చేయకుండా ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. టీఆర్టీకి ఇప్పటివరకు పెద్దగా దరఖాస్తులు రాలేదు. కొన్ని జిల్లాల్లో స్థానికత ఉన్నప్పటికీ పోస్టులు లేవని, పోస్టులు ఉన్న చోట నాన్‌–లోకల్‌ కోటాలో వెళ్లినా, ఆ కేటగిరీలో తక్కువ పోస్టులు ఉన్నాయని అభ్యర్థులు టీఆర్టీకి వెనకడుగు వేస్తున్నారు. తాజా టెట్‌ అర్హులు టీచర్‌ పోస్టులకు ఎక్కువగా దరఖాస్తు చేసే వీలుందని భావిస్తున్నారు.  

2016లో టెట్‌లో ఉత్తీర్ణత 

పేపర్‌

అభ్యర్థులు

ఉత్తీర్ణులు

శాతం

పేపర్‌–1

88,661

48,278

54.45

పేపర్‌–2

2,51,906

63,079

25.04

2017లో టెట్‌ ఉత్తీర్ణత

పేపర్‌–1

98,848

56,708

57.37

పేపర్‌–2 (సైన్స్‌)

1,11,018

20,233

18.22

పేపర్‌–2 (సోషల్‌)

1,19,914

24,732

20.62

2022లో టెట్‌ ఉత్తీర్ణత...

పేపర్‌–1

3.18,506

1,01,922

32.68

పేపర్‌–2

2,51,070

1,04,078

49.64

2023లో టెట్‌ ఫలితాలు ఇలా...

పేపర్‌

పరీక్ష రాసిన వారు

అర్హత పొందిన వారు

శాతం

పేపర్‌–1

2,23,582

82,489

36.89

పేపర్‌–2

మేథ్స్, సైన్స్‌

1,01,134

18,874

18.66

సోషల్‌ స్టడీస్‌

88,913

10,199

11.47

పేపర్‌–2 మొత్తం

1,90,047

29,073

15.30

Published date : 28 Sep 2023 12:05PM

Photo Stories