Skip to main content

TS TET Results 2023 Released : టీఎస్ టెట్‌-2023 ఫలితాలు విడుద‌ల‌.. ఒకేఒక్క‌ క్లిక్‌తో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో రిజ‌ల్ట్స్ చెక్ చేసుకోండిలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TET) ఫలితాలను ఈ సారి అత్యంత త్వ‌ర‌గా ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. టీఎస్ టెట్ 2023 పరీక్షకు సంబంధించిన‌ ఫ‌లితాల‌ను..సెప్టెంబర్ 27వ తేదీన ఉద‌యం 10:00 గంట‌ల‌కు విడుద‌ల చేశారు.
ts tet results 2023 released,Quick Release of TS TET 2023 Results,TS TET 2023 Exam Result Announcement
ts tet results 2023

సెప్టెంబర్ 15వ తేదీన టీఎస్ టెట్ ప‌రీక్ష‌ నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.ఈ ఫ‌లితాల‌ను కేవ‌లం 12 రోజుల వ్య‌వ‌ధిలోనే విడుద‌ల చేయ‌నున్నారు. ఇందుకు కోసం అధికారులు సన్నాహాలను పూర్తి చేశారు. ఈ ఫ‌లితాల‌ను www.sakshieducation.comలో చూడొచ్చు.

Check TS TET 2023 Results : Paper 1 | Paper 2

TS TET Paper-1&2 Final Key 2023 కీ కోసం క్లిక్ చేయండి
సెప్టెంబర్ 15న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్‌-1కు 2,69,557 మంది, పేపర్‌-2కు 2,08,498 మంది చేసుకున్నారు. టీఎస్ టెట్ పేప‌ర్‌-1 పరీక్షను 2,26,744 (84.12శాతం) రాశారు. బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2 పరీక్షను 91.11 శాతం మంది రాశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష జరుగగా.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్‌-2 రాతపరీక్ష నిర్వహించింది.

 TS TET Paper 1 Question Paper With Official Key 2023 : టీఎస్ టెట్-2023 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' విడుద‌ల‌.. ఈ సారి ఈ ప్ర‌శ్న‌ల‌కు..

TS TET Paper 2 Question Paper With Official Key 2023 : టీఎస్ టెట్-2023 పేప‌ర్‌-2 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' విడుద‌ల‌.. ఈ సారి ఈ ప్ర‌శ్న‌ల‌కు..

పేపర్-1కు 2 లక్షల 69 వేల 557 మంది దరఖాస్తు చేయగా.. 1139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ టూ 2 లక్షల 8 వేల 498 రాయగా.. 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి అని తెలిసిందే.

Published date : 27 Sep 2023 12:00PM

Photo Stories