Skip to main content

TS TET 2024 Results Date and Time : ముగిసిన టెట్‌ పరీక్షలు‌.. 'కీ' విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ ఎప్పుడంటే..? ఇక డీఎస్సీ 2024 ప‌రీక్ష‌లు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ప‌రీక్ష‌లు ముగిసాయి. ఇక ప‌రీక్ష రాసిన‌ చాలా మంది అభ్య‌ర్థులు ఫ‌లితాల కోసం ఎదురుచూస్తుంటారు. అలాగే కీ కోసం కూడా ఎదురుచూస్తుంటారు.
TS TET 2024 Results   Answer key document for TS TET-2024  Official notice about TS TET-2024 results and answer key

అయితే టెట్-2024 పరీక్షలకు 86.42 శాతం మంది హాజరైనట్టు కన్వీనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే టీఎస్ టీట్‌-2024 ఫలితాలు జూన్‌ 12న విడుదల  చేయనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ 'కీ' ని కూడా విడుద‌ల చేశారు.

☛ TS TET 2024 Initial Key కోసం క్లిక్ చేయండి

 TS TET 2024  Response Sheet కోసం క్లిక్ చేయండి

☛ TS TET 2024 Objections తెలుపుట కోసం క్లిక్ చేయండి

డీఎస్సీ నియామకాల్లో..

మే 20వ తేదీన‌ ప్రారంభమైన ఈ పరీక్షలు జూన్‌ 2 వరకు ప్రతి రోజు రెండు సెషన్స్‌లలో నిర్వహించారు. పరీక్షలు రాసేందుకు 2,86,381 మంది దరఖాస్తు చేసుకోగా, 2,36,487 మంది హాజరయ్యారు. అలాగే 49,894 మంది గైర్హాజరయ్యారు. రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరిగాయి. పేపర్ 1 పరీక్షకు 86.03 శాతం మంది హాజరుకాగా పేపర్ 2 పరీక్షకు 82.58 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. డీఎస్సీ నియామకాల్లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అలాగే ప్రభుత్వ టీచర్‌ పోస్టుల నియామకాలకు నిర్వహించే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) రాసేందుకు టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించవల్సి ఉంటుంది.

☛ తెలంగాణ డీఎస్సీ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఇక అంద‌రి చూపు.. డీఎస్సీ 2024 వైపే..

ts dsc 2024 telugu news

అలాగే డీఎస్సీ 2024 ప‌రీక్ష‌ల త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. 11,062 ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాల‌ భ‌ర్తీకి తెలంగాణ విద్యా శాఖ‌ నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ పోస్టుల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.

హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 537 అత్యధికంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో కేవలం 21 మాత్రమే ఉండగా…. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అత్య‌ధికంగా ఖ‌మ్మం జిల్లాలో 176 ఉన్నాయి. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 26 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఎస్టీటీలు 209గా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 ఎస్జీటీ ఖాళీలు ఉన్నాయి. హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 158 ఉండగా.. ఎస్జీటీ ఉద్యోగాలు 81 ఉన్నాయి. ఇక జగిత్యాల జిల్లాలో చూస్తే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 99 ఉన్నాయి. ఎస్జీటీ ఉద్యోగాలు 161గా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 224 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 84 స్కూల్ అసిస్టెంట్ లు ఖాళీగా ఉంటే..137 పోస్టులు ఎస్జీటీలు ఉన్నాయి.

Published date : 04 Jun 2024 10:59AM

Photo Stories