Skip to main content

Government Teachers Promotions and Transfers : టెట్‌పై తాజా న్యూస్‌.. అలాగే టీచర్ల బదిలీలు, పదోన్నతులు ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ టెట్‌ ఫలితాల అనంతరం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఉంటాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
ts government teachers promotions and transfers

డీఎస్సీ ద్వారా అదనంగా 11 వేల ఉపాధ్యాయ పోస్టులు అందుబాటులోకి వస్తున్నాయని, అన్నింటినీ కలిపి హేతుబద్ధీకరణ చేపడతామని తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేస్తామని వెల్లడించారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రత్యేక చట్టం రూపకల్పనపై ప్రభుత్వం దృష్టిసారించిందని తెలిపారు.

☛ Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌..

ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలను..
ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని, విద్యార్థుల్లో వ్యక్తిత్వ, మానసిక వికాసం, దేహదారుఢ్యం పెంపొందించేందుకు ప్రత్యేక సాంస్కృతిక, క్రీడాశిక్షణ తరగతులు నిర్వహిస్తామని, వారంలో నాలుగు రోజుల పాటు ఇవి ఉంటాయని, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా వీటిని చేపడతామని, పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదును పకడ్బందీగా నిర్వహించేందుకు ముఖ గుర్తింపు విధానంతో పనిచేసే యాప్‌ను ప్రవేశపెడతామని అని బుర్రా వెంకటేశం తెలిపారు.

 Government Teachers TET Eligibility 2023 : ఈ టీచ‌ర్ల‌కు చెక్‌.. మూడేళ్లలో 'టెట్‌' అర్హత సాధించాల్సిందే.. నిబంధనపై..

టెట్ ప‌రీక్ష జ‌రిగేనా..?
తెలంగాణ‌లో డీఎస్సీ, టెట్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు అడ్డంకులు ఎదుర‌వుతునే ఉన్నాయి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TS TET 2024) వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది. దీంతో పరీక్షను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి.
మే 27న ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనున్నది. అయితే మే 20 నుంచి జూన్‌ 3 వరకు టెట్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. పోలింగ్‌ రోజు ఆయా జిల్లాల్లో సాధారణ సెలవుగా ప్రకటిస్తారు.

టెట్‌ పరీక్షకు హాజరయ్యేవారంతా పట్టభద్రులేకానుండటంతో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉన్నది. అయితే ఇప్పటి వరకు ఏ తేదీన ఏ పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తారో వెల్లడించలేదు. ఎన్నికల షెడ్యూల్‌ దృష్ట్యా పేపర్ల వారీగా పరీక్షలు నిర్వహించే తేదీలతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే కేవలం పోలింగ్ తేదీన పరీక్ష నిర్వహించకుండా షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

Published date : 01 May 2024 01:11PM

Photo Stories