Skip to main content

CAT Results: క్యాట్‌–23 ప్రవేశ పరీక్షలో విద్యార్థుల సత్తా..

NIT Warangal Students Qualify CAT-23 for MBA Admission  CAT results 2023    NIT Warangal Students Celebrate CAT-23 Success  AT-23 Achievers from NIT Warangal

కాజీపేట అర్బన్‌: మేనేజ్‌మెంట్‌ విద్య ఎంబీఏలో ప్రవేశం పొందేందుకు దేశవ్యాప్తంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహించిన క్యాట్‌–23 (కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)లో నిట్‌ వరంగల్‌ విద్యార్థులు సత్తా చాటారు. క్యాట్‌–23 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఐఐఎం లక్నో గురువారం విడుదల చేసింది. కాగా.. నిట్‌ వరంగల్‌ ఈసీఈ విభాగంలో 2023 బీటెక్‌ పూర్తి చేసిన అమరగాని వేణుగౌడ్‌, మెటర్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి ఆవిరాల తిరుపతి, ఈఈఈ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి అతర్వ గౌవ్‌కర్‌, ఈసీఈ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి అక్కెల లక్ష్మణసాయి శ్రీకాంత్‌ అత్యధిక మార్కులు సాధించి ప్రతిష్టను నిలబెట్టారని నిట్‌ యాజమాన్యం గురువారం రాత్రి సంబరాలు జరుపుకుంది.
 

sakshi education whatsapp channel image link

Published date : 22 Dec 2023 03:17PM

Photo Stories