TS TET Exam Dates Changes 2024 : టీఎస్ టెట్ పరీక్ష తేదీలు మార్పు .. ఎందుకంటే..?
తెలంగాణలో డీఎస్సీ, టెట్ పరీక్షల నిర్వహణకు అడ్డంకులు ఎదురవుతునే ఉన్నాయి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TS TET 2024) వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో పరీక్షను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి.
అయితే మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. పోలింగ్ రోజు ఆయా జిల్లాల్లో సాధారణ సెలవుగా ప్రకటిస్తారు.
☛ Government Teachers TET Eligibility 2023: ఈ టీచర్లకు చెక్.. మూడేళ్లలో 'టెట్' అర్హత సాధించాల్సిందే.. నిబంధనపై..
టెట్ పరీక్షకు హాజరయ్యేవారంతా పట్టభద్రులే కానుండటంతో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉన్నది. అయితే ఇప్పటి వరకు ఏ తేదీన ఏ పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తారో వెల్లడించలేదు. ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా పేపర్ల వారీగా పరీక్షలు నిర్వహించే తేదీలతో కూడిన షెడ్యూల్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే కేవలం పోలింగ్ తేదీన పరీక్ష నిర్వహించకుండా షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు టెట్ పరీక్ష తేదీని మార్చాలని లేఖ రాసిన విషయం తెల్సిందే.
Tags
- ts tet 2024
- TS TET 2024 Postponed
- ts tet 2024 update news today
- ts tet 2024 update news today telugu
- ts tet 2024 exam update news telugu
- ts tet 2024 breaking news
- ts tet 2024 exam schedule
- ts tet 2024 exam schedule changes
- due to mlc elections ts tet 2024 exam schedule changes
- due to mlc elections ts tet 2024 exam schedule changes news telugu
- due to mlc elections ts tet 2024 exam date changes
- ts tet 2024 exam date changes
- ts tet 2024 exam date changes news in telugu
- ts tet latest news today 2024
- ts tet latest news today latest news telugu
- ts tet latest news today telugu
- ts tet 2024 dates changed