Skip to main content

TS TET 2023 Notification : బిగ్ బ్రేకింగ్‌... తెలంగాణ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌... డీఎస్సీపై క్లారిటీ..!

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. టెట్‌లో వ‌చ్చిన మార్కుల‌కు డీఎస్సీలోనూ వెయిటేజీ ఉంటుంది. పేప‌ర్‌-1,2 రెండిట్లోనూ అభ్య‌ర్థులు అర్హ‌త సాధించాలి. ప్రస్తుత విద్యా సంవ‌త్సరం చివ‌రి ఏడాది చ‌దివే అభ్యర్థులూ అర్హులే. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు.
TS TET 2023 Notification
బిగ్ బ్రేకింగ్‌... తెలంగాణ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌... డీఎస్సీపై క్లారిటీ..!

ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరించనున్నారు. సెప్టెంబర్‌ 15న పరీక్ష, 27న ఫలితాలు విడుదల కానున్నాయి. పేప‌ర్‌-1 మొత్తం 150 మార్కులు, పేప‌ర్‌-2 150 మార్కుల‌కు ఉంటుంది.

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

టెట్‌ వ్యవధి జీవితకాలం... కానీ,
తాజా అంచనాల ప్రకారం రాష్టంలో 1.5 లక్షల డీఎడ్‌, 4.5 లక్షల మంది బీఎడ్‌ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్‌ ద్వారా 8,792 టీచర్‌ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్‌ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్‌ వారికే ఇవ్వగా, ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు.

tet

దీంతో గతంలో టెట్‌ క్వాలిఫై అయిన వారితో పాటు బీఈడీ అభ్యర్థులకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది టెట్‌ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తిచేసిన వారు మరో 20వేల మంది వరకుంటారు. తాజా టెట్‌ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కుతుంది. అలాగే ఈ టెట్ ప‌రీక్ష ఫ‌లితాల త‌ర్వాత డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. 

 ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

tet

☛ అభ్యర్థులకు శుభ‌వార్త‌.. ! ఇక‌పై టెట్‌ ఒక్కసారి రాస్తే..

12 వేల టీచర్‌ పోస్టులను..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఓ అంచనా కాగా.. ప్రభుత్వం మాత్రం 12 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తామని తెలిపింది. చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. పైగా గత ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టారు. కొన్ని పాఠశాలల్లో ఎస్‌జీటీలను ఉన్నత తరగతులకు పంపుతున్నారు. ఇందులో చాలామంది స్కూల్‌ అసిస్టెంట్లకు అర్హత ఉన్నా, పదోన్నతులు లేకపోవడంతో ఫలితం దక్కడం లేదు. పదోన్నతులు లేకపోవడంతో బదిలీలు జరగడం లేదు.

Published date : 08 Sep 2023 03:46PM

Photo Stories