Skip to main content

TS DSC Notification 2024 : ఒక‌టి రెండు రోజుల్లోనే 11,000 ల‌కు పైగా టీచర్‌ పోస్టులకు నోటిఫికేష‌న్‌.. ఖాళీల వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఒక‌టి రెండు రోజుల్లోనే నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్ప‌నుంది. చివ‌రికి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు సర్వం సిద్ధమైంది. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.
Opportunity for employment in Telangana    Upcoming government announcement   telangana dsc and tet 2024 notification    Telangana government announcement

దాదాపు 11 వేల టీచర్‌ పోస్టులకు పైగా.. ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఉండే అవకాశం ఉంది. గతేడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు స్కూల్‌ అసిస్టెంట్‌ 1739 పోస్టులు.. భాషాపండిట్‌ పోస్టులు 611.. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 164.. ఎస్జీటీ 2575 పోస్టులున్నాయి.

☛ AP TRT Notification: 6,100 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం, సిలబస్‌ విశ్లేషణ, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్...

ఈ సారి డీఎస్సీ నిర్వహణకు సజావుగా..
ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. సుమారు మరో 5 వేల ఖాళీలను కలిపి కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. అలాగే.. ప్రత్యేక అవసరాల పిల్లల (సీడబ్ల్యూఎస్‌ఎన్‌)కు బోధించేందుకు దాదాపు 1,500 స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులను కూడా భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి డీఎస్సీ నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపర సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ లేదా మే లో టెట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. అలాగే జూలై లేదా ఆగ‌స్టులో డీఎస్సీ(DSC) ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

Published date : 21 Feb 2024 10:28AM

Photo Stories