Skip to main content

Government Teacher Transfer News : గుడ్‌న్యూస్‌.. జూన్ 7వ తేదీ నుంచే టీచ‌ర్ల బదిలీలు..రెండు రోజుల్లోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ప్ర‌భుత్వ టీచ‌ర్లుకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతులను జూన్ 7 నుంచి ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు.
Telangana government announcement  Telangana Government Teacher Transfer News  Education Department Principal Secretary Burra Venkatesham

జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బదిలీల, పదోన్నతుల ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు.ఈ బదిలీల, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను రెండు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. ఈ పదోన్నతుల ద్వారా దాదాపుగా 5,563 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించనున్నాయి.

11,062 ఉపాధ్యాయ పోస్టులు..
డీఎస్సీ ద్వారా అదనంగా 11,062 ఉపాధ్యాయ పోస్టులు అందుబాటులోకి వస్తున్నాయని, అన్నింటినీ కలిపి హేతుబద్ధీకరణ చేపడతామని తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేస్తామని గ‌తంలో బుర్రా వెంకటేశం తెలిపారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు.

Published date : 06 Jun 2024 10:22AM

Photo Stories