Skip to main content

AP TRT Notification: 6,100 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం, సిలబస్‌ విశ్లేషణ, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్...

బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది! ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో.. మొత్తం 6,100 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీ టీఆర్‌టీ (టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌-2024కి దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా విద్యా శాఖ పరిధిలోని పాఠశాలల్లో పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. ఏపీ టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసే పోస్ట్‌లు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, సిలబస్‌ విశ్లేషణ, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
 6,100 Posts Announcement    Application Process for APTRT 2024   Preparation Tips for APTRT Success Selection Process for Teacher Recruitment  AP TRT Notification Selection Procedure Syllabus Preparation Tips   Government School Teacher Recruitment
  • 6,100 పోస్ట్‌లతో ఏపీ టీఆర్‌టీ నోటిఫికేషన్‌
  • ఎస్‌జీటీ, ఎస్‌ఏ, పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్ట్‌లు
  • రాత పరీక్ష ఆధారంగా నియామకాలు
  • మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభం

మొత్తం 6,100 పోస్ట్‌లు
ఏపీ టీఆర్‌టీ ద్వారా మొత్తం 6,100 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. వీటిల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీ): 2,280 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్స్‌ (ఎస్‌ఏ): 2,285 పోస్టులు, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ): 1,264 పోస్టులు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ): 215 పోస్టులు, ప్రిన్సిపల్స్‌: 42 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు
ఆయా పోస్ట్‌లను అనుసరించి సంబంధిత విభాగంలో/సబ్జెక్టులో ఇంటర్, డీఈడీ/డీఈఎల్‌ఈడీ; బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ, బీఈడీ తదితర అర్హతలుండాలి. ఏపీ టెట్‌లో అర్హత సాధించాలి.

వయసు
జూలై 1, 2024 నాటికి 18-44 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా నిర్ణయించారు. 

రాత పరీక్షలో ప్రతిభ
ఆయా పోస్ట్‌లకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ను నిర్వహించనున్నారు. పోస్ట్‌ల వారీగా టెస్ట్‌ల ఆ వివరాలు..

చదవండి: AP TET 2024 Notification: నాలుగు పేపర్లుగా టెట్‌.. మెథడాలజీ, పెడగాజీలే మంచి మార్కులకు కీలకం... ఈ టిప్స్ ఫాలో అవ్వండి...

ఎస్‌జీటీ.. పరీక్ష
సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ పోస్టులకు 160 ప్రశ్నలు-80 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 8 పార్ట్‌లుగా పరీక్ష జరుగుతుంది. ఇందులో పార్ట్‌-1 జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 16 ప్రశ్నలు- 8మార్కులు; పార్ట్‌-2 పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌-8 ప్రశ్నలు-4 మార్కులు; పార్ట్‌-3 ఎడ్యుకేషన్‌ సైకాలజీ-16 ప్రశ్నలు-8మార్కులు; పార్ట్‌-4 లాంగ్వేజ్‌-1 కంటెంట్‌ 16 ప్రశ్నలు-8 మార్కులు, లాంగ్వేజ్‌-1 మెథడాలజీ 8 ప్రశ్నలు-4మార్కులు; పార్ట్‌-5 లాంగ్వేజ్‌-2(ఇంగ్లిష్‌) కంటెంట్‌ 16 ప్రశ్నలు-8 మార్కులు, మెథడాలజీ 8ప్రశ్నలు-4మార్కులు; పార్ట్‌-6 మ్యాథమెటిక్స్‌ కంటెంట్‌ 16 ప్రశ్నలు-8 మార్కులు, మ్యాథమెటిక్స్‌ మెథడాలజీ 8 ప్రశ్నలు-4 మార్కులు; పార్ట్‌-7 సైన్స్‌ కంటెంట్‌-16 ప్రశ్నలు-8 మార్కులు; సైన్స్‌ మెథడాలజీ 8 ప్రశ్నలు-4 మార్కులు; పార్ట్‌-8 సోషల్‌ స్టడీస్‌ కంటెంట్‌ 16 ప్రశ్నలు-8 మార్కులు, సోషల్‌ స్టడీస్‌ మెథడాలజీ 8 ప్రశ్నలు-4 మార్కులకు ఉంటుంది. లాంగ్వేజ్‌-1కు సంబంధించి అభ్యర్థులు తెలుగు/ఉర్దూ/హిందీ/తమిళం/ఒరియా/కన్నడ/సంస్కృతం భాషలను ఎంచుకోవచ్చు.

స్కూల్‌ అసిస్టెంట్స్‌ పరీక్ష స్వరూపం
స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు నాలుగు విభాగాలుగా 160 ప్రశ్నలు-80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పార్ట్‌-1 జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌-20 ప్రశ్నలు-10 మార్కులు; పార్ట్‌-2 పర్‌స్పెక్టివ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌-10 ప్రశ్నలు-5 మార్కులు; పార్ట్‌-3 క్లాస్‌రూమ్‌ ఇంప్లికేషన్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ సైకాలజీ-10 ప్రశ్నలు-5 మార్కులు; పార్ట్‌-4 సంబంధిత సబ్జెక్ట్‌ కంటెంట్‌-80 ప్రశ్నలు-40 మార్కులు, సంబంధిత సబ్జెక్ట్‌ మెథడాలజీ-40 ప్రశ్నలు-20 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

ప్రిన్సిపల్‌ పోస్ట్‌ల రాత పరీక్ష ఇలా
ఈ పోస్ట్‌లకు రెండు పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌-1ను ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌గా పేర్కొన్నారు. ఇందులో 100 ప్రశ్నలు-100 మార్కులకు ఉంటాయి. పేపర్‌-2ను 5 విభాగాల్లో 200 ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 30 ప్రశ్నలు-15 మార్కులు, పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ 30 ప్రశ్నలు-15 మార్కులు, ఎడ్యుకేషన్‌ సైకాలజీ 40 ప్రశ్నలు-20 మార్కులు, సమకాలీన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు, ఇతర కార్యక్రమాలు, అదే విధంగా స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కార్యక్రమాలు, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, స్కూల్‌ అడ్మినిస్ట్రేషన్, పర్యవేక్షణ -నాయకత్వ లక్షణాలు 70 ప్రశ్నలు-35 మార్కులు, టీచింగ్‌ మెథడాలజీపై అవగాహన 30 ప్రశ్నలు-15 మార్కులకు ఉంటాయి.

పీజీటీ పరీక్ష
పీజీటీ పోస్ట్‌లకు రెండు పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌-1 ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ 100 ప్రశ్నలు-100 మార్కులకు ఉంటుంది. పేపర్‌-2ను నాలుగు విభాగాలుగా 100 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్‌-1 జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 20 ప్రశ్నలు-10 మార్కులు; పార్ట్‌-2 పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ 20 ప్రశ్నలు-10 మార్కులు; పార్ట్‌-3 ఎడ్యుకేషన్‌ సైకాలజీ 20 ప్రశ్నలు-10 మార్కులు; పార్ట్‌-4 సంబంధిత సబ్జెక్ట్‌ కంటెంట్‌ 100ప్రశ్నలు-50 మార్కులు, సంబంధిత సబ్జెక్ట్‌ మెథడాలజీ 40 ప్రశ్నలు-20 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

టీజీటీ పరీక్ష ఇలా
ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ పరీక్షను కూడా రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. పేపర్‌-1 ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ 100 ప్రశ్నలు-100 మార్కులకు ఉంటుంది. పేపర్‌-2ను నాలుగు విభాగాలుగా 80 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్‌-1 జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 20 ప్రశ్నలు-10 మార్కులు; పార్ట్‌-2 పర్‌స్పెక్టివ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ 10 ప్రశ్నలు-5 మార్కులు; పార్ట్‌-3 క్లాస్‌రూమ్‌ ఇంప్లికేషన్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ సైకాలజీ 10 ప్రశ్నలు-5 మార్కులు; పార్ట్‌-4 సంబంధిత సబ్జెక్ట్‌ కంటెంట్‌ 80 ప్రశ్నలు-40 మార్కులు, సంబంధిత సబ్జెక్ట్‌ మెథడాలజీ 40 ప్రశ్నలు-20 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఫీజు చెల్లింపునకు చివరి తేది: 21-02-2024.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024,ఫిబ్రవరి 22
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: మార్చి 5 నుంచి
  • స్కూల్‌ అసిస్టెంట్, ఎస్‌జీటీ పరీక్ష తేదీలు: మార్చి 15 నుంచి 30 వరకు 
  • పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్‌ పరీక్ష తేదీలు: మార్చి 15 నుంచి 30 వరకు 
  • ఫలితాల వెల్లడి: 2024, ఏప్రిల్‌ 15
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://cse.ap.gov.in/

చదవండి: APPSC Jobs Notification 2024: గ్రూప్‌–1, 2 సహా పలు కీలక నోటిఫికేషన్లు.. ఉమ్మడి ప్రిపరేషన్‌తో సర్కారీ కొలువు ఖాయం


విజయం సాధించాలంటే
ఎస్‌జీటీ
ఎస్‌జీటీ అభ్యర్థులు జీకే, కరెంట్‌ అఫైర్స్‌ సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి. సబ్జెక్టుల వారీ పటిష్ట ప్రణాళికతో అధ్యయనం సాగించాలి. భౌగోళిక నా­మాలు, నదీతీర నగరాలు, దేశాలు-రాజధానులు, ప్రపంచంలో తొలి సంఘటనలు, అవార్డులు, సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ రాజకీయ, శాస్త్రసాంకేతిక అంశాలు తెలుసుకోవాలి.

  • విద్యా దృక్పథాలు: దేశంలో విద్యా చరిత్ర, కమిటీలు; వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలు-హక్కులు; జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం(ఎన్‌సీఎఫ్‌-2005); విద్యాహక్కు చట్టం, నూత­న విద్యా విధానం తదితర అంశాలపై పట్టు సాధించాలి.
  • విద్యా మనోవిజ్ఞానశాస్త్రం: శిశు వికాసం అభివృద్ధి్ధ,వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం అంశాలు చాలా ముఖ్యమైనవి. శిశు వికాసంలో వికాసం, పెరుగుదల, పరిపక్వత భావన-స్వభావం, వికాస నియమాలు, వికాసంపై ప్రభా­వం చూపే కారకాలు, వికాస దశలు తదితర అంశాలపై దృష్టి సారించాలి. ముఖ్య భావనలు, అనువర్తనాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. 
  • కంటెంట్‌: తెలుగు(ఆప్షనల్‌), ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టుల కంటెంట్‌లో సన్నద్ధతకు ప్రిపరేషన్‌ పరంగా పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. తెలుగులో కవులు-కావ్యాలు,అర్థాలు, పర్యాయపదాలు, జాతీయాలు తదితరాలతోపాటు భాషాంశాలను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, టెన్సెస్, టైప్స్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్‌ తదితరాలపై పట్టు సాధించాలి. గణితంలో అర్థమెటిక్, సంఖ్యా వ్యవస్థ, క్షేత్ర గణితం, రేఖా గణితం, బీజ గణితం, సాంఖ్యక శాస్త్రం అంశాలపై పట్టు సాధించాలి. పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్‌ను అధ్యయనం చేయడం లాభిస్తుంది. 
  • సైన్స్‌లో జీవ ప్రపంచం, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్స్‌లో విభాగాలు, పోషణ, ఆహార పిరమిడ్‌ , మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలు-క్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై దృష్టి సారించాలి.« ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టుసాధించాలి. అదే విధంగా జీవవైవిధ్యం, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్యలు, భూతాపం తదితర అంశాలు ముఖ్యమైనవి.
  • సోషల్‌ స్టడీస్‌లో స్థానిక భౌగోళిక అంశాలు, ఖండాలు, పారిశ్రామిక విప్లవం, మనీ-బ్యాంకింగ్, ప్రభుత్వం; రాజకీయ వ్యవస్థలు, జాతీయ ఉద్యమం, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు, అసమానతలు, మతం-సమాజం, సంస్కృతి, కమ్యూనికేషన్‌ తదితర అంశాలపై అవగాహన అవసరం. 

స్కూల్‌ అసిస్టెంట్‌కు ఇలా

  • మ్యాథమెటిక్స్‌: బీజ గణితం,సదిశా బీజ గణి­తం, వైశ్లేషిక రేఖాగణితం, కలన గణితం,త్రికోణమి తి అంశాలపై పట్టు సాధించాలి. బయాలజీలో జీవ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం, జీవశాస్త్రం-ఆధునిక పోకడలు, జంతు ప్రపంచం తదితర పాఠ్యాంశాలు ఎంతో ముఖ్యమైనవి. 
  • స్కూల్‌ అసిస్టెంట్స్‌-సోషల్‌ స్టడీస్‌: భారత స్వాతంత్య్ర ఉద్యమం, ప్రపంచ యుద్ధాలు-అనంతర పరిస్థితులు; రాజ్యాంగం, యూఎన్‌వో, సమకాలీన ప్రపంచ అంశాలు; జాతీయ ఆదాయం, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తదితర అంశాలపై దృష్టి సారించాలి.వరల్డ్‌ జాగ్రఫీ, ఇండియన్‌ జాగ్రఫీలపై పట్టుసాధించాలి. 
  • సైన్స్‌: జీవ ప్రపంచం, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్స్‌లో విభాగాలు, పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలు-క్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై దృష్టి సారించాలి.« ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టుసాధించాలి. అదే విధంగా మన పర్యావరణానికి సంబంధించి జీవవైవిధ్యం, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్యలు, భూతాపం తదితర అంశాలు ముఖ్యమైనవి. 
  • మెథడాలజీ: ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధన ఉద్దేశాలు, విద్యా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర పాఠ్యాంశాల­పై అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం బీ­ఈడీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. 
     
Published date : 20 Feb 2024 10:29AM

Photo Stories