Skip to main content

BECIL contract basis jobs: BECILలో కాంట్రాక్ట్‌ పద్దతిలో భారీగా ఉద్యోగాలు జీతం నెలకు 28,000

BECIL contract basis jobs   BECIL recruitment notification 2025  BECIL recruitment details for 170 vacancies
BECIL contract basis jobs

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుంచి 170 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

10వ తరగతి అర్హతతో CISF కానిస్టేబుల్, డ్రైవర్ ఉద్యోగాలు జీతం నెలకు 69,100: Click Here

భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య : BECIL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 170 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు : 
BECIL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి. 
బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. (లేదా) 
జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరి విద్యార్హతతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

Norcet-6 పరీక్ష క్వాలిఫై అయి ఉండాలి. మరియు వెయిటింగ్ లిస్టులో పేరు ఉండాలి.

అనుభవం : ఈ అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు. అనుభవం ఉన్నవారికి ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రాధాన్యత ఇస్తారు.

జీతం : ఎంపికైన వారికి నెలకు 28,000/- శాలరీ ఇస్తారు.

వయస్సు : 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

అప్లికేషన్ ఫీజు : 
Broadcast Engineering Consultants India Ltd, Noida అనే పేరు మీద డిడి తీయాలి.
General / OBC / Ex-Serviceman / Women అభ్యర్థులకు Rs.590/-
SC / ST / EWS / PH అభ్యర్థులకు Rs.295/-

అప్లై విధానము : అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.

అప్లికేషన్ చివరి తేదీ : ఫిబ్రవరి 4వ తేదీ

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P)

అప్లికేషన్ కు జతపరచవలసిన డాక్యుమెంట్స్ : 

1. విద్యార్హత ధృవపత్రాలు.

2. 10వ / జనన ధృవీకరణ పత్రం.

3. కుల ధృవీకరణ పత్రం

4. పని అనుభవ ధృవీకరణ పత్రం

5. పాన్ కార్డ్ కాపీ

6. ఆధార్ కార్డ్ కాపీ

7. EPF / ESIC కార్డ్ కాపీ ఉంటే జతపరచాలి.

8. అప్లికేషన్ ఫీజు చెల్లించిన డిడి 

జాబ్ లొకేషన్ : CAPFIMS, Maidan garhi, AIIMS, New Delhi.


Notification Full Details: Click Here

Published date : 28 Jan 2025 08:30AM

Photo Stories