Skip to main content

Indian Navy SSC Officer jobs: BTech, డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో SSC Officer ఉద్యోగాలు జీతం నెలకు 1లక్ష 10వేలు

Indian Navy jobs
Indian Navy jobs

ఇండియన్ నేవీ నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ (SSC Officers) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 270 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 8వ తేదీ నుండి ఫిబ్రవరి 25వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది.

పంచాయతీ రాజ్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు జీతం నెలకు 75,000: Click Here

భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 270 పోస్టులు భర్తీ చేస్తున్నారు .

భర్తీ చేస్తున్న పోస్టులు : 
భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ పోస్టులు, పైలట్, నావెల్ హెయిర్ ఆఫీసర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్ బ్రాంచ్ , ఇంజనీరింగ్ బ్రాంచ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్, నావెల్ కన్స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు : 
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఉద్యోగాలకు 60 శాతం మార్కులతో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. 
పైలట్ ఉద్యోగాలకు 60% మార్కులతో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి సిపిఎల్ లైసెన్స్ పొందువు ఉండాలి.
నావెల్ ఎయిర్ ఆఫీసర్ (అబ్జర్వర్) ఉద్యోగాలకు 60 శాతం మార్కులతో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) ఉద్యోగాలకు 60 శాతం మార్కులతో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
లాజిస్టిక్స్ ఉద్యోగాలకు బిఈ లేదా బీటెక్ లేదా ఎంబీఏ లేదా బిఎస్సి లేదా బీకాం లేదా ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి. 
ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉద్యోగాలకు బిఈ లేదా బీటెక్ 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఉద్యోగాలకు బిఈ లేదా బిటెక్ 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి. 
నావెల్ కన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 08-02-2025 తేది నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ : 25-02-2025 తేది లోపు అప్లై చేయాలి. 

అప్లికేషన్ విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 1,10,000/- జీతము ఇస్తారు.

వయస్సు : 
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, లాజిస్టిక్స్, ఇంజనీరింగ్ బ్రాంచ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్, నావెల్ కన్స్ట్రక్టర్ పోస్టులు ఉద్యోగాలకు 02-01-2001 నుండి 01-07-2006 మధ్య పుట్టిన తేదీ ఉన్న వారు అర్హులు.
పైలట్, నావెల్ హెయిర్ ఆఫీసర్ ఉద్యోగాలకు 02-01-2002 నుండి 01-02-2007 మధ్య పుట్టిన తేదీ ఉన్న వారు అర్హులు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 02-01-2001 నుండి 01-01-2005 మధ్య పుట్టిన తేదీ ఉన్న వారు అర్హులు.
ఎడ్యుకేషన్ బ్రాంచ్ 02-01-2001 నుండి 01-01-2005 మధ్య పుట్టిన తేదీ ఉన్న వారు అర్హులు.

వయస్సు సడలింపు : 
SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : 
అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా అర్హత పరీక్షల వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను SSB ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

Download Full Notification: Click Here

Apply Online: Click Here

Published date : 10 Feb 2025 09:29PM

Photo Stories