Skip to main content

Rubber Board Field Officer jobs: డిగ్రీ అర్హతతో రబ్బర్ బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు జీతం నెలకు 34,800

Apply for Field Officer post at Rubber Board, Ministry of Commerce   Rubber Board Field Officer jobs  Rubber Board Field Officer recruitment notification 2024
Rubber Board Field Officer jobs

భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన రబ్బర్ బోర్డు నుండి ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

హైదరాబాద్ పంచాయతీ రాజ్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు జీతం నెలకు 75,000: Click Here

భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 పోస్టులు భర్తీ చేస్తున్నారు .

భర్తీ చేస్తున్న పోస్టులు : రబ్బరు బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు : అగ్రికల్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బొటనిలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.

అప్లికేషన్ ఫీజు :
GEN / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 1000/-
SC / ST / మహిళలకు అప్లికేషన్ ఫీజు లేదు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28-01-2025 తేది నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ : 10-03-2025 తేది లోపు అప్లై చేయాలి. 

పరీక్ష తేదీ : పరీక్ష తేదీను తరువాత ప్రకటిస్తారు.

అప్లికేషన్ విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవల్ 6 ప్రకారం పే స్కేల్ ఇస్తారు. (9,300/- నుండి 34,800/- + గ్రేడ్ పే 4,200/-)

వయస్సు : 01-01-2025 నాటికి గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి.

వయస్సు సడలింపు : 
SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

Download Full Notification: Click Here

Apply Online: Click Here

Published date : 12 Feb 2025 08:30AM

Photo Stories