Skip to main content

AP TRT: ఏపీలో సంక్షేమ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ వివిధ సంక్షేమ విద్యా సంస్థల్లో ప్రిన్సిపల్‌, టీజీటీ, పీజీటీ, పీడీ ఖాళీల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (TRT/DSC) 2024 నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసింది.
Teacher Recruitment Test (TRT/DSC) 2024 Notification   Andhra Pradesh State Government Commissioner of School Education    AP DSC 2024 Notification Out For TGT, PGT Teacher Posts   Welfare Educational Institutions

మొత్తం పోస్టుల సంఖ్య: 1,264.

ఖాళీలు ఉన్న విద్యా సంస్థలు ఇవే..
ఏపీ మోడల్‌ స్కూల్స్‌, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఈఎస్‌(MJPTBCWREIES), ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌(APSWREIS), ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ (గురుకులం).

పోస్టుల వివరాలు..
1. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (PGT): 215 
2. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (TGT): 1,264 
3. ప్రిన్సిపాల్‌: 42 
4. ఫిజికల్‌ డైరెక్టర్‌: 13 

ఉమ్మడి జిల్లాల వారిగా ఉన్న‌ ఖాళీలు ఇవే..
1. శ్రీకాకుళం - 49 
2. విజయనగరం- 84
3. విశాఖపట్నం - 95 
4. తూర్పు గోదావరి - 102
5. పశ్చిమ గోదావరి - 59 
6. కృష్ణా - 65
7. గుంటూరు - 137 
8. ప్రకాశం - 93
9. ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు - 102 
10. చిత్తూరు- 139
11. కడప- 103 
12. అనంతపురం - 115
13. కర్నూలు - 121

APPSC Notifications: ఈ వారంలో వెలువడనున్న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవే..

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ/ఎంపీఎడ్‌ విద్యార్హతతో పాటు, ఏపీ టెట్‌/సీటెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి: 2024 జూలై 1 నాటికి ఓసీలకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు 49 ఏళ్లు, వికలాంగులకు 54 ఏళ్లు.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, రిజర్వేషన్‌ రూల్‌ తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.750.

పరీక్ష కేంద్రాలు: మొత్తం 122 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలను ఏపీతో పాటు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో కేటాయించారు.

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 21-02-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 22-02-2024.

రాత పరీక్ష: 15-03-2024 నుంచి 30-03-2024 వరకు ఉంటుంది.

వెబ్‌సైట్‌: https://apdsc.apcfss.in/

Published date : 19 Feb 2024 01:10PM
PDF

Photo Stories