Skip to main content

APPSC Notifications: ఈ వారంలో వెలువడనున్న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవే..

నిరుద్యోగ యువతకు శుభవార్త.
APPSC Forest Department Recruitment 2024

ఇప్పటికే గ్రూప్‌– 1, 2 పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన ఏపీపీఎస్సీ త్వరలో అటవీ శాఖలో పలు ఉద్యోగా­లను భర్తీ చేయనుంది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో ఈమేరకు వివిధ కేటగిరీల్లో 861 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది. ఒకవైపు గ్రూప్‌–2 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు అటవీశాఖ ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైంది. 

మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సమాచారం. వీటిలో 37 ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్లు, 70 ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్లు, 175 ఫారెస్టు బీట్‌ ఆఫీ­సర్లు, 375 అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్లు, 10 తానాదార్లు, 12 టెక్నికల్‌ అసిస్టెంట్లు, మరో 10 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు కలిపి 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఇవి కాకుండా ఎఫ్‌ఎస్‌ఓ, బీట్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ లాంటి మరో 172 క్యారీ ఫార్వర్డ్‌ పోస్టులతో కలిపి మొత్తం 861 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌తో పాటు పరీక్షల షెడ్యూల్‌ను కమిషన్‌ త్వరలో ప్రకటించనుంది. ఇవే కాకుండా విద్యుత్తు శాఖలో అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్, మత్స్యశాఖలో ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, జైళ్ల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్టు పోస్టు, ఏపీ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ విభాగంలో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. 

గ్రూప్‌–2 హాల్‌ టికెట్ల విడుదల.. 
గ్రూప్‌–2 ప్రిలిమినరీ (స్క్రీనింగ్‌ టెస్ట్‌) పరీక్షకు సంబంధించి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రక్రియ ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఒక్క రోజులోనే 2 లక్షల మందికిపైగా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

ఫిబ్ర‌వ‌రి 25వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏపీపీఎస్సీ 24 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేసింది. గ్రూప్‌–2లో మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు.

APPSC Gr-II 2024 Selection Ratio: గ్రూప్-2  ప్రిలిమ్స్ లో ఎంపిక రేషియో ఎంతంటే... 45 వేల మంది మెయిన్స్ పరీక్షకు!!

Published date : 15 Feb 2024 11:13AM

Photo Stories