TS DSC District Wise Teacher Jobs 2023 Details : 6,612 పోస్టులకు నోటిఫికేషన్.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే.. కాంట్రాక్ట్ టీచర్లలను..
పాఠశాల విద్యాశాఖలో 5,089 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. వివిధి కేటగిరీల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ముందకు వెళ్లనుంది.
జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, జిల్లా విద్యాధికారి సెక్రటరీగా, జిల్లా పరిషత్ సీఈవో సభ్యులుగా గల కమిటీ ఈ నియామకాలను చేపట్టనుంది.
పోస్టుల వివరాలు ఇవే..
మొత్తం 5,089లో.. 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు ఇలా..
స్కూల్ అసిస్టెంట్ (SA) : 1739
సెకండరీ గ్రేడ్ టీచర్లు : 2575
భాష పండితులు : 621
పీఈటీలు : 164
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ప్రాథమిక పాఠశాలలో : 796
ప్రాథమికోన్నత పాఠశాలలు : 727
ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేయడం లేదు. గతంలో మాదిరిగా డీఎస్సీ(జిల్లా ఎంపిక కమిటీలు) ద్వారా నియామకాలు ఉంటాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అంటే.. టెట్‌లో అర్హత సాధించిన వాళ్లంతా టీఆర్‌టీకి పోటీ పడేందుకు అర్హులన్నమాట. అందులో అర్హత సాధించిన వాళ్లను డీఎస్సీకి పంపుతారు. ఆయా జిల్లాల డీఎస్సీలు నియమకాలు చేపడతాయి.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ సెప్టెంబర్ 15వ తేదీన ఉండనుంది. అదే నెల 27వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత వెంటనే ఉపాధ్యాయుల పోస్టుల నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను కూడా..
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఒప్పంద టీచర్లను క్రమబద్దీకరించడంపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 567 మంది కాంట్రాక్ట్ టీచర్లను క్రమబద్దీకరిస్తూ ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.
మొత్తంగా 1,22,386 టీచర్ పోస్టులు ఉండగా..
తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 1,22,386 టీచర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 1,03,343 టీచర్లు పనిచేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 1,947 స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా, 2,162 టీచర్లకు పీఎస్ హెచ్‌ఎంగా, మరో 5,870 సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు స్కూల్ అసిస్టెంట్స్ పదోన్నతులు కల్పించాల్సి ఉందని చెప్పారు. ఇవి పోనూ ఖాళీగా ఉన్న 6,612 పోస్టులను ప్రత్యక్షంగా భర్తీ చేస్తున్నట్టు తెలిపారు.
TS DSC District Wise Teacher Jobs List 2023 :
☛ ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips
☛ TET/DSC 2023: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..
☛ TS TET 2023 Notification : డీఎస్సీపై క్లారిటీ..!
☛ TS TET 2023: టెట్ షెడ్యూల్... పరీక్ష విధానం.. అర్హత మార్కులు ఇలా..
☛ చదవండి: టెట్ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | 2022 ప్రివియస్ పేపర్స్
☛ TS TET 2022 Paper-1 Question Paper & Key
☛ TS TET 2022 Paper-2 Final Key: టీఎస్ టెట్ పేపర్-2 ఫైనల్ 'కీ' విడుదల.. ఈ సారి మాత్రం..
Tags
- ts teacher jobs 2023
- TS DSC 2023
- TS DSC 2023 Notification
- Government Teacher Jobs
- Post Graduate Teacher Jobs
- TS Teacher Jobs Details
- TS District Wise Teacher Jobs List 2023
- ts trt notification 2023
- ts dsc sgt 2023
- DSC SGT Syllabus 2023
- TS TRT SGT Syllabus Exam Pattern
- 6612 teacher posts
- sakshi education