Jobs: నిమ్స్‌లో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: Nizam's Institute Of Medical Sciences (NIMS)లో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి లభించింది.
నిమ్స్‌లో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో శాఖాపరమైన ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసుకునేందుకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ జనవరి 4న ఉత్తర్వులు జారీ చేసింది. కేడర్ వారీగా ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్లు, ఉద్యోగ అర్హతలు తదితర వివరాలను సంబంధిత కార్యదర్శి ద్వారా తీసుకుని భర్తీ చేయాలని డీఎస్సీకి సూచిస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టుల విషయంలో గతంలో ఉన్న ఉత్తర్వులన్నీ రద్దు చేస్తున్నట్టు కూడా వెల్లడించారు.