Skip to main content

Jobs: వైద్య పోస్టులకు నోటిఫికేషన్

వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయడానికి 31 (ఓపెన్ కేటగిరి) సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ పోస్టుల భర్తీకి మే 9న నోటిఫికేషన్ జారీచేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ హైమావతి తెలిపారు.
Notification for medical posts
వైద్య పోస్టులకు నోటిఫికేషన్

శాశ్వత ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేస్తున్నామన్నారు. ఎంబీబీఎస్‌ విద్యార్హత కలిగి, మెడికల్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవడంతో పాటు, గత ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి 42 ఏళ్ల వయస్సు మించని వారు అర్హులని ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మూడేళ్లు.. శారీరక వికలాంగులకు పదేళ్లు.. ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీ వారికి మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుందన్నారు. జిఝజఠీ.్చp.జౌఠి.జీn వెబ్‌సైట్‌ ద్వారా మే 10 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని డాక్టర్‌ హైమావతి తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు మే 19వ తేదీ సా.5.30 గంటల వరకు ఉంది.

చదవండి: 

​​​​​​​115 మంది మెడికల్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు పదోన్నతులు

PG Medical Seats: పీజీ వైద్య కన్వీనర్‌ కోటా సీట్లకు నోటిఫికేషన్‌

Medical posts: ఔట్‌ సోర్సింగ్‌లకూ 30% వెయిటేజీ

Sakshi Education Mobile App
Published date : 10 May 2022 12:46PM

Photo Stories