Skip to main content

600 SBI Jobs: ఎస్‌బీఐలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.85,920 జీతం..

కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
600 Probationary Officer Posts in SBI   SBI Probationary Officer Recruitment 2025 Notification  SBI Recruitment for Probationary Officer Posts  State Bank of India PO Job Openings 2025  Central Public Sector Bank Job Notification 2025

మొత్తం పోస్టుల సంఖ్య: 600.
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. చివరి సంవత్సరం ఫైనల్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.04.2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920.
ఎంపిక విధానం: ఫేజ్‌–1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్‌–2 మెయిన్‌ ఎగ్జామినేషన్, ఫేజ్‌–3 సైకోమెట్రిక్‌ టెస్ట్, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 100 మార్కులకు–100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (40 ప్రశ్నలు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌(30 ప్రశ్నలు), రీజనింగ్‌ ఎబిలిటీ(30 ప్రశ్నలు)ల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 1 గంట.
మెయిన్స్‌ పరీక్ష: మొత్తం 200 మార్కులకు–170 ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఇందులో రీజనింగ్‌–కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ (40 ప్రశ్నలు–60 మార్కులు), డేటా అనాలసిస్‌–ఇంటర్‌ప్రెటేషన్‌ (30 ప్రశ్నలు–60 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ నాలెడ్జ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (40 ప్రశ్నలు–20 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16.01.2025  
ఫేజ్‌–1 ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2025 మార్చి 08,15.
ఫేజ్‌–2 ఆన్‌లైన్‌ మెయిన్‌ ఎగ్జామ్‌: ఏప్రిల్‌/మే 2025.
ఇంటర్వ్యూ, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: మే/జూన్, 2025.
వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers/current-openings

>> 13735 Jobs for SBI: ఎస్‌బీఐలో 13,735 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు.. అర్హత, ఎంపిక విధానం వివ‌రాలు ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 02 Jan 2025 09:55AM

Photo Stories