Skip to main content

Medical posts: ఔట్‌ సోర్సింగ్‌లకూ 30% వెయిటేజీ

30% weightage for outsourcing
30% weightage for outsourcing
  • ∙వైద్య పోస్టుల్లో ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయం
  • ∙ప్రతిపాదనలు ప్రభుత్వానికి.. రెండు వారాల్లో నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీపై ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చేపట్టిన నియామకాల్లో కాంట్రా క్టు ఉద్యోగులకే వెయిటేజీ కల్పించగా తాజా భర్తీల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ వర్తింపజే యాలని నిర్ణయించింది. డాక్టర్‌ పోస్టులకు రాత పరీక్ష ఉండకపోవడంతో వారికి వైద్యవిద్యలో వచ్చిన మార్కులకు 70 శాతం, మిగిలిన 30 శాతాన్ని వెయిటేజీగా ఇవ్వనుంది. నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది రాత పరీక్షకు 70 శాతం, వెయిటేజీ 30 శాతం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కొత్తగా చేరబోయే వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీసు రద్దుపైనా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీటిని ప్రభుత్వానికి వైద్యారోగ్య శాఖ ఇటీవలే పంపింది. అనుమతి రాగానే ఆ మార్గదర్శకాలపై ఉత్తర్వులు వెలువడతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

Also read: Education Sector: కలలో కూడా ఊహించని మహర్దశ 

సర్వీస్‌ నిబంధనల్లో భారీ మార్పులు
కొత్త పోస్టుల భర్తీ నేపథ్యంలో సర్వీస్‌ నిబంధనల్లో భారీగా మార్పులు చేర్పులు చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. గతంలో స్టాఫ్‌ నర్సులు, ఇతర పారామెడికల్‌ పోస్టుల సమయంలో తలెత్తిన న్యాయపరమైన చిక్కులు ఈసారి తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని భావిస్తోంది. దాదాపు 2 దశాబ్దాల క్రితం తయారైన సర్వీస్‌ నిబంధనలు నాటి పరిస్థితుల ప్రకారం ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ కోర్సులు, పోస్టుల్లో మార్పులు జరిగాయి. కొత్త కోర్సులు వచ్చాయి. పాత నిబంధనల ప్రకారం కొత్త కోర్సులు చేసినవారు అనర్హులయ్యే పరిస్థితులున్నాయి. దీంతో తాజా పరిస్థితుల ప్రకారం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా, ఎవరూ కోర్టులకు వెళ్లే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనిపై కసరత్తు జరుగుతోందని, సర్కారు ఆదేశాల తర్వాత నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వైద్య వర్గాలు తెలిపాయి. మరో రెండు వారాల్లో నోటిఫికేషన్‌ వెలువడుతుందని అంటున్నారు.  

Also read: KNRUHS notification: పీజీ వైద్య ప్రవేశాలకు తుది నోటిఫికేషన్‌

Published date : 30 Apr 2022 03:23PM

Photo Stories