KNRUHS notification: పీజీ వైద్య ప్రవేశాలకు తుది నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య కనీ్వనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తుది మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే నాలుగు విడతల కౌన్సెలింగ్ పూర్తి కాగా, ఇంకా ఖాళీగా ఉన్న కనీ్వనర్ కోటా సీట్లను ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని సూచించింది. ఈనెల 27న సాయంత్రం 4 గంటల నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యక్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. గత కౌన్సెలింగ్‌లో సీట్ అలాట్ అయి చేరకపోయినా, చేరి వదిలేసినా అలాగే అఖిల భారత కోటాలో ఇప్పటికే సీటు పొందిన ఆయా అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులని యూనివర్సిటీ పేర్కొంది. ప్రస్తుతం కాళోజీ యూనివర్సిటీ, ఆలిండియా కోటా రెండింటి పరిధిలో ఏ సీటు లేని అభ్యర్థులకు ఒకసారి మినహాయింపు కింద కౌన్సెలింగ్‌కు అవకాశమిస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలిండియా కోటా మాప్‌అప్ కౌన్సెలింగ్ రద్దు చేసిన నేపధ్యంలో ఆలిండియా కోటా మాప్‌అప్ విడత కౌన్సెలింగ్‌లో సీటు పొంది.. రాష్ట్ర కౌన్సెలింగ్‌లో పొందిన సీటును విడిచిపెట్టిన అభ్యర్థులకు రాష్ట్ర కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana. gov.inను సందర్శించాలని సూచించింది.
Also read: EAMCET BiPC Counselling: 29న బైపీసీ స్ట్రీం కోర్సుల స్పాట్ కౌన్సెలింగ్