115 మంది మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు
Sakshi Education
బోధనాసుపత్రుల్లో పనిచేసే 115 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కలి్పంచాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
వివిధ విభాగాలకు చెందిన వారందరికీ మే ఏడో తేదీ ఉదయం 10 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి, పోస్టింగ్ ఇస్తామని వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) రమేష్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (టీటీజీడీఏ) నాయకులు డాక్టర్ కిరణ్ మాదల, డాక్టర్ అన్వర్, డాక్టర్ ప్రతిభా లక్షి్మ, డాక్టర్ జలగం తిరుపతిరావు, డాక్టర్ కిరణ్ ప్రకాష్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
Published date : 04 May 2022 01:08PM