PG Medical Seats: పీజీ వైద్య కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మే 1న స్ట్రే వేకెన్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫైనల్ మాప్ అప్ విడత కౌన్సెలిం గ్ తరవాత ఖాళీగా ఉన్న పీజీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి యూనివర్సిటీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. తుది మెరిట్ జాబితా లోని అభ్యర్థులు మే 2న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గత విడత కౌన్సెలింగ్‌లో సీట్ అలాటై జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కంటిన్యూ చేసినా, ఆలిండియా కోటాలో ఇప్పటికే చేరి న అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inలో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
Published date : 02 May 2022 01:12PM