AP High Court : ఏపీ అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్.. 560 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు..
Sakshi Education
అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధించి శుభవార్త. పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 23వ తేదీన (బుధవారం) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అంగన్‌వాడీ పోస్టుల భర్తీపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ వర్కర్లకు విస్తరణ అధికారులుగా పదోన్నతి ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో.. నవంబర్ 23వ తేదీన (బుధవారం) విచారణ కొనసాగగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీపై స్టే ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఇదిలా ఉంటే.. అంగన్‌వాడీ కేంద్రాల్లో 560 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఈఓ) పోస్టుల భర్తీకి ఆమధ్య ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల భర్తీ ప్రక్రియను..
అంగన్‌వాడీ సూపర్‌వైజర్(గ్రేడ్–2) పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దంటూ రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గతంలోనే స్పష్టత ఇచ్చింది.
Published date : 23 Nov 2022 04:09PM