Skip to main content

Andhra Pradesh : నిరుద్యోగులకు అలర్ట్.. 1010 పోస్టుల‌ భ‌ర్తీకి సీఎం ఆదేశాలు.. అలాగే సూపర్‌వైజర్ల పోస్టులను కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాస్టళ్ల రూపురేఖలు మార్చి, అత్యుత్తమ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
AP CM YS Jagan Mohan Reddy
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఇందులో భాగంగా రూ.3,364 కోట్లతో 3,013 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల ఆధునీకరణకు నాడు–నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు.

చ‌ద‌వండి: Books for Groups Preparation: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..

సమాజంలో అట్టడుగున ఉన్న వారు చదువుకోవడానికి..
అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలపై న‌వంబ‌ర్ 18వ తేదీన (శుక్రవారం) ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో మంచి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కిచెన్‌లు సైతం ఆధునీకరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని, సమాజంలో అట్టడుగున ఉన్న వారు చదువుకోవడానికి తగిన పరిస్థితులు కల్పించాలని చెప్పారు. బంకర్‌ బెడ్స్, తదితర అన్ని సౌకర్యాలు నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని, భవనాలను పరిగణనలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు.

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ap cm

హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. పిల్లలు చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. హాస్టళ్లలోకి వెళ్లగానే జైల్లోకి వెళ్లామనే భావన వారికి కలగకూడదు. చదువులు కొనలేని కుటుంబాల వారే పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు. అందువల్ల అలాంటి పిల్లలు బాగా చదువుకుని, బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలి. మన పిల్లలనే హాస్టళ్లలో ఉంచితే ఎలాంటి వసతులు, వాతావరణం ఉండాలనుకుంటామో సంక్షేమ హాస్టళ్లన్నింటినీ అలా తీర్చిదిద్దాల‌న్నారు.

చదవండి: ఏపీపీఎస్సీ - సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌

మొత్తంగా 3,013 చోట్ల రూ.3,364 కోట్లతో..
☛ మూడు దశల్లో హాస్టళ్ల ఆధునీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3,013 చోట్ల రూ.3,364 కోట్లతో నాడు–నేడు పనులు చేపట్టాలి. మొదటి దశలో మొత్తం సుమారు 1,366 చోట్ల పనులు చేపట్టాలి. 

☛ దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ తొలి విడతలోనే బాగు చేయాలి. తొలి విడత పనులు జనవరి నుంచి ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.

☛ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలి. కిచెన్‌కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను కొనుగోలు చేయాలి. హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు స్పష్టంగా కన్పించాలి. పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యమైన వాటిని అందించాలి. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలి. మండలాల వారీగా పర్యవేక్షణ ఉండాలి.

చదవండి: APPSC Group 1 Preparation Tips: గ్రూప్‌-1.. గురి పెట్టండిలా!

1010 పోస్టులను వెంట‌నే భర్తీ చేయండి..
➤ హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలి. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్‌ టేకర్ల పోస్టులను భర్తీ చేయాలి. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 171 మంది హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారుల నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లలో క్లాస్‌–4 ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలి. ప్రతి హాస్టల్‌ను పరిశీలించి, కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలి.
➤ హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్‌ ఉంచాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్‌ ఉంచాలి. అంగన్‌వాడీలలో నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలి. టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి.

చదవండి: Group 1 Preliminary Exam: 60 డేస్‌ ప్రిలిమ్స్‌ ప్లాన్‌.. సిలబస్‌, సబ్జెక్ట్‌ అంశాలు..

అంగన్‌వాడీలలో సూపర్‌వైజర్ల పోస్టుల భ‌ర్తీకి..
➤ అంగన్‌వాడీలలో సూపర్‌వైజర్ల పోస్టులను భర్తీ చేసినట్టు అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిపారు. గత సమీక్షలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు. అంగన్‌వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
➤ అక్టోబర్‌ నెలలో నూటికి నూరు శాతం పాల సరఫరా జరిగింది. డిసెంబర్‌ 1 నుంచి ఫ్లేవర్డ్‌ మిల్క్‌ను అంగన్‌వాడీల్లో సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం’ అని వివరించారు. 
➤ మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్లేవర్డ్‌ మిల్క్‌ను సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

ఇటీవ‌లే 6,511 పోలీస్ ఉద్యోగాల‌కు కూడా.. 

ap police jobs

ఇటీవల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ కూడా త్వరలో పూర్తి కానుంది. ఇటీవల దీనికి సంబంధించి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి శ్రీకాకుళంలో పర్యటనలో భాగంగా.. ఏపీ పోలీసు శాఖలో 6500 కానిస్టేబుల్ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని ప్రకటన చేసిన విష‌యం తెల్సిందే.

➤ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

అత్యధికంగా సివిల్‌ విభాగంలో..
రిజర్వ్‌ విభాగంలో 96 ఎస్సై పోస్టులను, అలాగే సివిల్‌ విభాగంలో 315 ఎస్సై పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్పెషల్‌ విభాగంలో 2520 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. అలాగే సివిల్‌ విభాగంలో 3580 కానిస్టేబుల్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెల్సిందే. మొత్తం 6511 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఒకే సారి ఇచ్చే అవ‌కాశం ఉంది. అత్యధికంగా సివిల్‌ విభాగంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. కొన్నేళ్లుగా పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగుల‌కు త్వ‌ర‌లోనే ఊర‌ట ల‌భించ‌నున్న‌ది.

Published date : 19 Nov 2022 08:51PM

Photo Stories