NEET Ranker Success Story : నీట్ పీజీ ఫలితాల్లో రైతు బిడ్డలు ప్రతిభ .. నా లక్ష్యం ఇదే..
![రజియా](/sites/default/files/images/2023/03/16/neet-pg-ranker-success-stroy-1678953256.jpg)
కర్నూలు జిల్లాలోని మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన చెన్నూరు హుసేని, చెన్నూరు హుసేనమ్మలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో కుమార్తె రజియా అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేయాలన్న సంకల్పంతో నీట్ పరీక్షలు రాయగా 571 మార్కులు వచ్చాయి. ఆలిండియా స్థాయిలో 5248వ ర్యాంకు వచ్చింది. చిన్నపిల్లల వైద్యనిపుణురాలిగా మంచి పేరు తెచ్చుకుని పేదలకు సేవచేయాలన్నదే తన లక్ష్యమని ఈమె తెలిపారు.
చదవండి: NEET UG Entrance Exam 2023: నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల
చదవండి: నీట్ నిరాశ పరిచినా.. మరెన్నో మార్గాలు!!
1,82,318 మంది అభ్యర్థులు..
![neet ranker story telugu](/sites/default/files/inline-images/neet.jpg)
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)పీజీ– 2023 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్చి 14న విడుదల చేసిన విషయం తెల్సిందే. వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 5న దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్షను నిర్వహించారు. 849 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,82,318 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లోనే ఫలితాలు వెలువడ్డాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 31న ఫలితాలు వెలువడాల్సి ఉంది. వ్యక్తిగత స్కోర్ కార్డును మార్చి 25న అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
☛ NEET(UG) 2023: నీట్ (యూజీ) నోటిఫికేషన్ విడుదల... ఇలా అప్లై చేసుకోండి
నీట్ పీజీ కటాఫ్ ఇలా..
కేటగిరి |
పర్సంటైల్ |
స్కోర్(800లకు) |
జనరల్/ఈడబ్ల్యూఎస్ |
50 |
291 |
జనరల్–పీడబ్ల్యూబీడీ |
45 |
274 |
ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ (పీడబ్ల్యూబీడీతో కలిపి) |
45 |
257 |