Skip to main content

NEET UG 2025 Applications : నీట్ యూజీ 2025కు ద‌ర‌ఖాస్తులు ప్రారంభం.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

ఇంట‌ర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎంబీబీఎస్‌, బీడీస్ వంటి వైద్య విద్య కోర్సుల్లో ప్ర‌వేశం పొందేందుకు ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది.
NEET UG 2025 online applications and exam details

సాక్షి ఎడ్యుకేష‌న్: ఇంట‌ర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎంబీబీఎస్‌, బీడీస్ వంటి వైద్య విద్య కోర్సుల్లో ప్ర‌వేశం పొందేందుకు ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. అదే నీట్ యూజీ 2025.. నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్‌. ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణత పొందినవారు ఉన్న‌త యూనివ‌ర్సిటీల్లో లేదా క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశాలు పొందుతారు.

NEET UG 2025 Exam Format : పాత ప‌ద్ధ‌తిలోనే నీట్ యూజీ 2025.. ఎన్‌టీఏ వివ‌రణ‌..

అయితే, నీట్ కోసం ఇప్ప‌టికే చాలామంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. వారికి ఎన్‌టీఏ శుభ‌వార్త తెలిపింది. ద‌ర‌ఖాస్తులు, ప‌రీక్ష తేదీల వివ‌రాల‌ను వెల్ల‌డించి తీపి క‌బురు చెప్పింది.

ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి ఎన్‌టీఏ ప్ర‌తీ ఏటా నిర్వ‌హించే ప‌రీక్ష నీట్ యూజీ. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తులు శుక్ర‌వారం, అంటే.. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన ప్రారంభం అయ్యాయి.

NEET 2025 Exam: నీట్‌ యూజీలో కీలక మార్పు... కరోనా సమయంలో ప్రవేశపెట్టిన ప్రశ్నల విధానానికి స్వస్తి

ముఖ్య‌మైన వివ‌రాలు..

ద‌ర‌ఖాస్తుల ప్రారంభం: ఫిబ్ర‌వ‌రి 7, 2025

ఫీజు: జనరల్‌ క్యాటగిరీ వారికి రూ.1700, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ రూ.1600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000

సిటీ ఇన్ఫర్మేషన్‌ స్లిప్స్‌: ఏప్రిల్ 26వ తేదీన‌

హాల్‌టికెట్లు: మే 1 నుంచి

NEET UG Exam Process Clarity : నీట్ ప‌రీక్షను ఆన్‌లైన్‌కు నో అంటున్న ప్ర‌భుత్వం.. కార‌ణాలు ఇవే..!

ప‌రీక్ష తేదీ: మే 4న.. మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

ప‌రీక్ష విధానం: ఆఫ్‌లైన్‌లో ఉంటుంది.

ఫలితాలు: జూన్ 14వ తేదీలోగా..

అర్హ‌త, ఆస‌క్తి ఉన్న‌వారు ప్ర‌క‌టించిన తేదీలోగా అధికారిక వెబ్‌సైట్ నుంచి ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. హాల్‌టికెట్లు విడుద‌లైన త‌రువాత అభ్య‌ర్థులు వారి వివ‌రాల‌ను న‌మోదు చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవాలి, ప్రింట్ కూడా తీసుకోవాలి.

 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 08 Feb 2025 12:38PM

Photo Stories