Skip to main content

NEET UG 2025 Exam Format : పాత ప‌ద్ధ‌తిలోనే నీట్ యూజీ 2025.. ఎన్‌టీఏ వివ‌రణ‌..

ఉన్నత వైద్య క‌ళాశాల‌లో లేదా యూనివ‌ర్సిటీల్లో ప్ర‌వేశం పొందేందుకు విద్యార్థులు ఎన్‌టీఏ ఏటా నిర్వ‌హించే నీట్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించాల్సి ఉంటుంది.
NTA Announcement   NTA clarifies on neet ug 2025 exam pattern   NEET 2025 Exam Announcement by NTA  Offline NEET Exam 2025 Update

సాక్షి ఎడ్యుకేషన్: ఉన్నత వైద్య క‌ళాశాల‌లో లేదా యూనివ‌ర్సిటీల్లో ప్ర‌వేశం పొందేందుకు విద్యార్థులు ఎన్‌టీఏ ఏటా నిర్వ‌హించే నీట్ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించాల్సి ఉంటుంది. ఈ ప‌రీక్ష‌ల‌ను ప్ర‌తీ ఏటా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలోనే నిర్వ‌హిస్తారు. కాని, ఈసారి ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించాల‌ని కోరగా, ఈ విచారంపై అనేక చ‌ర్చ‌లు జరిపారు. చివ‌రికి, ప్ర‌తీ ఏటా నిర్వ‌హించిన విధంగానే ఈసారి కూడా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించ‌నున్నారని ఎన్‌టీఏ వెల్ల‌డించింది.

NEET UG Exam Process Clarity : నీట్ ప‌రీక్షను ఆన్‌లైన్‌కు నో అంటున్న ప్ర‌భుత్వం.. కార‌ణాలు ఇవే..!

ప‌రీక్ష విధానం..

వైద్య క‌ళాశాల‌లో ప్ర‌వేశం పొందేందుకు నిర్వ‌హించే నీట్ యూజీ ప‌రీక్ష‌కు.. 180 ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రం ఉంటుంది. దీనికి సమయం.. 180 నిమిషాలు (3 గంటలు) ఉండగా, ఆఫ్‌లైన్‌లో ఓఎమ్ఆర్ ప‌ద్ధ‌తిలోనే నిర్వ‌హిస్తారు. ఒకేరోజు, ఒకే షిఫ్టులో ప‌ద్ధ‌తిలో ఈ పరీక్షను నిర్వ‌హిస్తామ‌ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది.

NEET UG One Day One Shift : ఒకేరోజు.. ఒకే షిఫ్ట్‌.. ఈ విధానంలోనే నీట్ యూజీ ప‌రీక్ష‌!!

కేంద్ర విద్య, ఆరోగ్యశాఖల మధ్య సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం చివరకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిర్ణయం మేరకు.. నీట్ యూజీ పరీక్ష పెన్-పేపర్ విధానంలో నిర్వహించనున్నామ‌ని స్ప‌ష్టం చేసింది.

కోవిడ్ 19 సమయంలో ప‌రీక్ష‌లో ప్రవేశపెట్టిన ప్రశ్నల ఎంపిక విధానం ఇప్పుడు తొల‌గించిన‌ట్లు ఎన్టీఏ ప్ర‌క‌టించింది. ఇప్పుడు, ఈ ప‌రీక్ష‌ల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి 45 చొప్పున ప్రశ్నలు, బయాలజీలో నుంచి 90 ప్రశ్నలకు 3 గంటల్లో పరీక్షను రాయాల్సి ఉంటుందని పేర్కొంది.

APAAR for NEET : ఇక‌పై ఆధార్‌తోపాటు అపార్ కూడా..!! ఎన్‌టీఏ కీల‌క నిర్ణ‌యం..

ఈ కోర్సులు కూడా..

నీట్ యూజీ 2025 ప‌రీక్ష‌లో విద్యార్థుల‌కు వ‌చ్చే ఫలితాల ఆధారంగా వారికి, ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు.. నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ (బీఎహ్ఎమ్ఎస్‌) కోర్సులో ప్రవేశాలు ఉంటాయి. అంతేకాకుండా, ఆర్మ్డ్‌ మెడికల్ సర్వీస్ హాస్పిట‌ల్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల‌లో కూడా ప్రవేశాలు ఉంటాయి. వైద్య విద్య‌కు సంబంధించిన వివిధ కోర్సుల్లో ప్ర‌వేశం పొందాలంటే, విద్యార్థులు ఖ‌చ్చితంగా నీట్ యూజీలో ఉత్తీర్ణ‌త‌, అర్హత సాధించాల్సి ఉంటుందని ఎన్‌టీఏ స్ప‌ష్టం చేసింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 29 Jan 2025 12:51PM

Photo Stories