Skip to main content

APAAR for NEET : ఇక‌పై ఆధార్‌తోపాటు అపార్ కూడా..!! ఎన్‌టీఏ కీల‌క నిర్ణ‌యం..

నేష‌నల్ లెవెల్‌లో నిర్వ‌హించే ప‌రీక్ష‌లో ఒక‌టి నీట్‌. వైద్య విద్య‌ను పొందేందుకు వైద్య క‌ళాశాలలో సీటు సాధించాలంటే విద్యార్థులు త‌ప్పనిస‌రిగా రాయాల్సిన ప‌రీక్ష నీట్‌.
NTA announces apaar cards for neet exam  NEET exam instructions   National Education Policy 2020

సాక్షి ఎడ్యుకేష‌న్: నీట్‌ ప‌రీక్ష ప్ర‌తీఏటా జాతీయ స్థాయిలో నిర్వ‌హిస్తారు. అయితే, గ‌తంలో ఈ ప‌రీక్ష‌పై, ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌పై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప‌రీక్ష‌కు ముందే ప్ర‌శ్న‌ప‌త్రాలు లీక్ అవ్వ‌డం, వాయిదాలు ప‌డ‌డం వంటివి చాలానే జ‌రిగాయి. అయితే, ఇక‌పై ఇలాంటివి ఉండ‌కూడద‌ని కేంద్ర విద్యాశాఖ నిర్ణ‌యించింది. ఈ నిర్ణ‌యంలో భాగంగానే కొత్త విధానాన్ని వెలుగులోకి తెచ్చింది. అదే అపార్ కార్డులు..

జాతీయ స్థాయిలో నిర్వ‌హించే ఈ నీట్ ప‌రీక్ష‌కు విద్యార్థులు త‌మ ఆధార్ కార్డుల‌ను త‌ప్ప‌నిస‌రిగా కేంద్రానికి తీసుకురావాల‌ని ఆదేశాలు ఉన్నాయి. కాని, ఇప్ప‌టి నుంచి విద్యార్థులు కేవ‌లం ఆధార్ కార్డులు మాత్రమే కాకుండా అపార్ కార్డుల‌ను కూడా త‌మ వెంట తీసుకురావాల‌ని నిర్ణ‌యించింది. పూర్తి వివ‌రాల్లోకి వ‌స్తే.. 2020 కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం కేంద్రం 'వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడి' కార్యక్రమంలో భాగంగా అపార్ ఐడీని అందుబాటులోకి తెచ్చింది.

NEET PG News: పీజీ వైద్య విద్య నిబంధనల సవరణ సబబే : హైకోర్టు తీర్పు

ఆధార్ కార్డ్ లాగా, దేశం అంతటా ప్రతి విద్యార్థికి ప్రత్యేక 12 అంకెల గుర్తింపు సంఖ్య ఇస్తున్నారు. వారి అకడమిక్ క్రెడిట్స్ ను ఒకే చోట ఉంచడం ద్వారా విద్యార్ధులు, తల్లితండ్రులతో పాటు విద్యావేత్తలకు ఈ సమాచారం అందుబాటులో ఉంచడమే దీని లక్ష్యం. ఇప్పుడు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఈ సమాచారం పొందాలనుకుంటోంది. ఇప్పుడు దీనిని కూడా కేంద్ర విద్యాశాఖ ఈ ప‌ద్ధ‌తిని త‌ప్ప‌నిస‌రి చేసింది.

అపార్‌కు కారణం..

ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేది ఎన్‌టీఏ.. నేష‌నల్ టెస్టింగ్ ఏజెన్సీ. అయితే, ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎన్టీఏ ఈసారి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జాతీయ స్ధాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో లీకుల గోల ప్ర‌స్తుతం పెద్ద సమస్యగా మారిపోయింది. వీట‌న్నింటిని అరిక‌ట్టేందుకు  ప్ర‌భుత్వం, ప‌రీక్ష కేంద్రాలు, విద్యాశాఖ ఇలా ఎవ్వ‌రు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న జ‌ర‌గాల్సిన పొర‌పాట్లు జ‌రుతూనే ఉన్నాయి. ఎన్ని శిక్ష‌ల‌ను నిర్ణ‌యించి, ఈ లీకుల గోల ఆగ‌డం లేదు. అందుకు ఎన్‌టీఏ ఈసారి ఒక కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. అదే అపార్.. ఎన్‌టీఏ తీసుకున్న జాగ్ర‌త్త‌ల‌లో భాగంగా ఇకపై మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలకు అపార్ ఐడీ తప్పనిసరి అని నిర్ణ‌యించింది.

NEET UG-2025:నీట్‌ యూజీ–2025 పెన్,పేపర్‌తోనే.. అక్రమాలకు తావు లేకుండా పరీక్ష విధానం: ఎన్‌టీఏ

ఆధార్ మాదిరిగానే అపార్‌..

నీట్ యూజీ 2025 పరీక్ష రాసే ప్ర‌తీ విద్యార్థి తమ రిజిస్ట్రేషన్ చేసుకునే స‌మ‌యంలో, పరీక్షా ప్రక్రియ సమయంలో వారి అపార్ ఐడీని, అప్‌డేట్ చేసిన ఆధార్‌ని రెండింటినీ ఉపయోగించాల‌ని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఆదేశించింది. ఒక‌వేళ‌, ఇప్పటివరకూ అపార్ ఐడీ లేని వారు ఉంటే, వారు సైతం అపార్ కార్డును రిజిస్టర్ చేసుకుని దీని నంబర్‌ను కచ్చితంగా పొంది ప‌రీక్ష రెజిస్ట్రేష‌న్ లో న‌మోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే రిజిస్ట్రేషన్ తో పాటు పరీక్షలకు ప్రవేశం కూడా లభిస్తుంది. లేకపోతే విద్యార్థుల‌కు చిక్కులు తప్పవు. ఈ విధానాన్ని విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని వివ‌రించింది ఎన్‌టీఏ.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 17 Jan 2025 11:37AM

Photo Stories