NEET UG Exam Process Clarity : నీట్ పరీక్షను ఆన్‌లైన్‌కు నో అంటున్న ప్రభుత్వం.. కారణాలు ఇవే..!

సాక్షి ఎడ్యుకేషన్: నీట్, ప్రతీ ఏటా జాతీయ స్థాయిలో ఎన్‌టీఏ నిర్వహిస్తుంది. అయితే, ప్రతీ సంవత్సరం ఈ పరీక్షను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. అంటే, పెన్ అండ్ పేపర్ విధానంలోనే నిర్వహిస్తారు. కాని, ఈసారి ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో అంటే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిసంచాలని సూచించారు ఇస్రో మాజీ ఛీఫ్ కే రాధాకృష్ణన్ కమిటీ.
నో టు ఆన్‌లైన్..
నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకల నేపధ్యంలో సుప్రీంకోర్టు నియమించిన రాధాకృష్టన్ ఈసారి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని కోరారు. కాని, కేంద్ర ప్రభుత్వం మాత్రం మరోసారి ఏమాత్రం అవకతవకలకు చోటు లేకుండా ఆఫ్‌లైన్‌లోనే పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో, నీట్ పరీక్షలో జరిగిన సంఘలన తరువాత, మరికొన్ని నిబంధనలను, లేదా ఉన్న నిబంధనలనే మరింత కఠినంగా పాటిస్తూ నీట్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించింది.
ఆఫ్‌లైన్‌కు కారణం!!
నీట్ అభ్యర్థులకు ఆన్‌లైన్‌ను వదిలి, ఆఫ్‌లైన్ నిర్వహించాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. గతంలో నీట్‌కు హాజరైనవారి సంఖ్య 24 లక్షలమంది. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్నించి వచ్చే వారి సంఖ్యలో పెద్ద మొత్తంలో ఉంటుంది. కాగా, ఈ ఏటా ఏకంగా 28 నుంచి 30 లక్షల సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతారని తెలుస్తోంది. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో హాజరవుతున్న వారికి ఆన్‌లైన్ విధానంలో పరీక్షను నిర్వహించడం కష్టంగా ఉంటుంది. మౌళిక సదుపాయాల కల్పన చాలా కష్టమౌతుంది. ప్రస్తుత పరిస్థికి, కేవలం 1 లక్ష 50 వేల మంది విద్యార్థులకు మాత్రమే ఆన్‌లైన్ విధానంలో నిర్వహించగలం. ఇలా చేస్తే, ఒకటి రెండు కాదు, ఏకంగా పది సార్లు ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది.
JEE(మెయిన్) 2025 : - జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 అడ్మిట్ కార్డ్ విడుదల
నష్టాలు ఇవే..
ఇప్పుడు ఉన్న స్థితికి, విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షను నిర్వహిస్తే, వరుసగా పది రోజులు కేటాయించాల్సి ఉంటుంది. ఇందులో, అవే ప్రశ్నలు రిపీట్ కావచ్చు. పేపర్ లీక్‌కు అవకాశం కూడా లేకపోలేదు. కొందరికి పరీక్ష సులభమౌతుంది. కాని, గ్రామంలో నుంచి వచ్చే వారికి ఇది అంత సులభంగా ఉండదు. వారికి వీటిపై పూర్తి అవగాహన ఉండదు. ఒకే విధమైన పరీక్ష పత్రం ఉండదు. మౌళిక సదుపాయాల కల్పన అన్నింటికంటే అతి పెద్ద సమస్యగా మారనుంది. దీంట్లో, గ్రామంలోంచి వచ్చే విద్యార్థులకు కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండి ఉండాలి. ఇది చాలా మందికి ఉండవు.
Education News: ఆంధ్ర ప్రదేశ్ పీజీ వైద్య విద్యార్థులపై.. ఫీజుల భారం
మరో ఏడాది ఆఫ్‌లైనే.. కాని..
నీట్ పరీక్ష నిర్వహణను ఆఫ్‌లైన్‌లో నిర్ణయించేందుకు మరో కారణం.. పెద్ద ఎత్తున విద్యార్ధులు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉండటం. పరీక్షకు కేవలం మూడు నెలల ముందు ఆన్ లైన్ అంటే గ్రామీణ విద్యార్ధులకు పట్టు ఉండదు. పట్టణ ప్రాంత విద్యార్ధులకు ఆన్‌లైన్ పరీక్ష అలవాటున్నట్టుగా గ్రామీణ విద్యార్ధులకు ఉండదు. అందుకే మరో ఏడాది ఇదే ఆఫ్‌లైన్ విధానం కొనసాగనుంది. కాని, పరిస్థితులు అనుకూలంగా ఉంటే వచ్చే ఏడాది ఆన్‌లైన్‌లో నిర్వవహించే అవకాశాలు ఉన్నాయి. కాని, ఏదైనా విద్యార్థులకు ముందే ప్రకటిస్తుంది ప్రభుత్వం.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- NEET UG 2025
- Entrance Exam
- academic year exam
- entrance exam for medical college admissions
- medical colleges and universities
- Admissions 2025
- medical colleges admissions 2025
- neet ug 2025 admissions
- National Eligibility cum Entrance Test
- medical courses admission test 2025
- neet online exam 2025
- central government decision on neet exam process 2025
- National Testing Agency
- national level entrance exam
- Education News
- Sakshi Education News