Skip to main content

NEET UG One Day One Shift : ఒకేరోజు.. ఒకే షిఫ్ట్‌.. ఈ విధానంలోనే నీట్ యూజీ ప‌రీక్ష‌!!

మెడిక‌ల్ కాలేజీల్లో, యూనిర్సిటీల్లో ప్ర‌వేశం పొందాలంటే, విద్యార్థులు త‌ప్పనిసరిగా రాయాల్సిన ప‌రీక్ష నీట్ యూజీ.
NEET ug exam 2025 to be conducted in regular omr manner

సాక్షి ఎడ్యుకేష‌న్: మెడిక‌ల్ కాలేజీల్లో, యూనిర్సిటీల్లో ప్ర‌వేశం పొందాలంటే, విద్యార్థులు త‌ప్పనిసరిగా రాయాల్సిన ప‌రీక్ష నీట్ యూజీ. అయితే, ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన ఎన్‌టీఏ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అదే ప‌రీక్ష విధానంపై వివ‌ర‌ణ‌.. వివ‌రాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్​ యూజీ-2025 పరీక్షను పెన్​ అండ్​ పేపర్​ (ఓఎంఆర్) పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది.

APAAR for NEET : ఇక‌పై ఆధార్‌తోపాటు అపార్ కూడా..!! ఎన్‌టీఏ కీల‌క నిర్ణ‌యం..

ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌ను ఒకేరోజు ఒకే షిఫ్ట్ విధానంలో దేశ‌వ్య‌ప్తంగా నీట్ 2025 ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నుంది. దీంతో ఎటువంటి ఇబ్బందుకు చోటుచేసుకోకుండా ఉంటుంది అని కేంద్రం భావిస్తోంది. ''నేషనల్​ మెడికల్​కమిషన్​ (ఎన్ఎంసీ) నిర్ణయం ప్రకారం.. నీట్​ యూజీ -2025ను ఓఎంఆర్​ పద్ధతిలో నిర్వహిస్తాం. ఒకే రోజు.. ఒకే షిఫ్ట్​లో పరీక్ష ఉంటుంది' అని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్టీఏ) సీనియర్​ అధికారి తెలిపారు.

NEET PG News: పీజీ వైద్య విద్య నిబంధనల సవరణ సబబే : హైకోర్టు తీర్పు

కంప్యూట‌ర్ ప‌రీక్షా.. ఓఎమ్ఆర్ ప‌రీక్ష‌..!

జాతీయ స్థాయిలో ప్ర‌తీ ఏటా నిర్వ‌హించే ఈ ప‌రీక్ష‌కు 2024లో 24 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌ను రాశారు. దేశ‌వ్య‌ప్తంగా ఉన్న మెడిక‌ల్ కాలేజీల్లో, యూనివ‌ర్సిటీల్లో అడ్మిష‌న్ పొందేందుకు విద్యార్థులను నీట్ ప‌రీక్ష‌తోనే ఎంపిక చేస్తారు. గ‌తంలో చోటుచేసుకున్న ప్ర‌శ్న ప‌త్రాల లీకేజ్ కార‌ణంగా ఈసారి మరిన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తూ, ప‌రీక్ష‌ను కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​ విధానంలో నిర్వహించే అవకాశాలున్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవ‌లె​ తెలిపారు. ఆయ‌న మాత్ర‌మే కాదు, కస్తూరి రంగన్‌ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ కూడా ఈ విధానం స‌రైంద‌ని సూచించ‌గా.. తాజాగా నిర్వ‌హించిన స‌మావేశంలో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌గా ఎప్ప‌టిలాగే ప‌రీక్ష‌ను ఓఎమ్ఆర్ ఫార్మాట్‌లోనే నిర్వ‌హించ‌నున్నాట్లు వెల్ల‌డించారు విద్యాశాఖ అధికారులు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 17 Jan 2025 12:08PM

Photo Stories