NEET Ranker Success Stories : ఒకే ఇంట్లో ముగ్గురికి మెడికల్ సీట్లు.. కారణం ఇదే..
ఇందులో భాగంగానే.. నల్లగొండ జిల్లా వీర్లపాలెం గ్రామానికి చెందిన నేనావత్ బుజ్జిబాబు-పార్వతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. వీరు ముగ్గులు ఒకే సారి నీట్‌లో ర్యాంక్‌లు సాధించారు.
ఈ ముగ్గురు.. నీట్ ర్యాంక్‌లు కొట్టారిలా..
పెద్ద కూతురు హైమావతి నాలుగేండ్ల క్రితం నీట్‌లో ర్యాంకు సాధించి హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్‌లో చేరి హౌస్ సర్జన్ పూర్తి చేసింది. రెండో కూతురు నేనావత్ పద్మ రెండేండ్ల క్రితం నీట్‌లో ర్యాంకు సాధించి విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చేరింది. ప్రస్తుతం మెడిసిన్ రెండో సంసత్సరం చదువుతున్నది. వీరితోపాటు కుమారుడు నేనావత్ రామకృష్ణ ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో 67 వేల ర్యాంకు సాధించి ఉస్మానియాలో సీటు సాధించాడు. ఇలా ఒకే ఇంట్లో ముగ్గురు విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసిస్తుండటం విశేషం.
☛ NEET 2023 Rankers: నీట్‌లో అదరగొట్టిన గొర్రెల కాపర్ల కూతుర్లు... పూరి గుడిసెలో ఉంటూ.. కోచింగ్‌కు డబ్బులు లేకపోవడంతో...
ఈ ముగ్గురూ ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇదే మండలంలోని వాచ్యా తండాకు చెందిన లావూరి శ్రీనునాయక్ కూతురు ఖుషి నీట్‌లో 60 వేల ర్యాంకు సాధించి హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో సీటు పొందింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌కు చెందిన కొంగల సాయికిరణ్ టెన్త్, ఇంటర్ కరీంనగర్‌లో చదువుకున్నాడు. హాయిగా సాగుతున్న తన జీవితంలో తండ్రికి ఆరేండ్ల కింద పక్షవాతం రావడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. చదువు మానేసి.. తన ఇంటి ముందే నల్లగొండ రోడ్డుకు ఆనుకొని బజ్జీల బండి ఏర్పాటు చేశాడు. సాయికిరణ్ ఎంబీబీఎస్ చదవాలనుకున్న విషయాన్ని గిరిప్రసాద్ అనే వ్యక్తి తెలుసుకొని శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యానికి తెలిపారు.
ఈ మేరకు సాయికిరణ్‌కు అక్కడ నీట్‌లో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. పట్టుదలతో చదివి నీట్‌లో స్టేట్ ర్యాంకు 5,533 సాధించాడు. ఇటీవలే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య విజ్ఞాన కళాశాలలో అడ్మిషన్ పొందాడు. శ్రీ చైతన్య డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి సాయికిరణ్‌ను అభినందించారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి.. తమ లాంటి నిరుపేద విద్యార్థుల డాక్టర్ కావాలన్న కోరికను నెరవేర్చుతున్న ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు తెలిపారు.
☛ Ritika : పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది..కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు..