Skip to main content

Ritika : పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది..కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు..

న్యూఢిల్లీ: 2021లో నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన చాలా మంది విద్యార్థులలో మోలార్‌బండ్‌లోని సర్వోద్య కన్యా విద్యాలయానికి చెందిన రితిక కూడా ఒకటి.
Ritika, NEET Ranker
Ritika, NEET Ranker

కాకపోతే తను ఎలాంటి ప్రైవేట్ కోచింగ్ లేకుండానే సొంతంగానే పేపర్ అయ్యి మెరిట్ ర్యాంకును సాధించింది. రితిక తన తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి బదర్‌పూర్‌లో ఒక చిన్న ఇంట్లో నివసిస్తోంది. తన తండ్రి ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఎంబ్రాయిడరీ పని చేస్తూ వారు జీవనాన్ని సాగించేవాళ్ళు.

కోవిడ్ కారణంగా..
కోవిడ్ లాక్‌డౌన్ మూలాన రితిక తండ్రి ఉపాధిని కోల్పోయాడు.దీంతో వారి ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో రితిక ఇంట్లో మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ కూడా లేదు.   తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమెకు ఆండ్రాయిడ్ ఫోన్, పుస్తకాలు అవసరమైన తరుణంలో వాటిని కొనడానికి కూడా డబ్బులు లేవని ఆ పరిస్థితుల్లో తన పెళ్లి కోసం ఇంట్లో దాచిన నగలు అమ్మి అవి కొన్నట్లు చెప్పింది. చివరకు అన్ని కష్టాలను దాటుకొని ఆమె 500 మార్కులు సాధించి ఎస్సీ విభాగంలో ఆల్ ఇండియా 3,032 ర్యాంక్‌ను సాధించింది. 

కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేక‌..
నీట్‌లో మంచి స్కోర్ (93%) సాధించడంతో తన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపింది. తను ప్రైవేట్ కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేని కారణంగా యూట్యూబ్ క్లాసులు, కొన్ని పుస్తకాల నుంచి సొంతంగా పరీక్షలకు ప్రిపేర్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు చాలా సహాయం చేసినట్లు చెప్పింది రితిక. ఈ ఏడాది ఢిల్లీ పాఠశాలల నుంచి మొత్తం 436 మంది విద్యార్థులు నీట్‌లో ఉత్తీర్ణత సాధించారు.

చ‌ద‌వండి :

Inspirational Story: ‘జై భీమ్‌’ సినిమా సీన్‌ను రీపిట్‌ చేసిన గిరిజన యువతి..ఎలా అంటే..?

NEET Cut Off Marks 2021 : నీట్‌ టాప్‌ ర్యాంకర్‌ మనోడే...ఈసారి తగ్గిన కటాఫ్‌ మార్కులు..

NEET-UG 2021: నీట్‌ రాసారా.. ఇది మీ కోసమే!

NEET cut off: కటాఫ్, ఎంపికైన విద్యార్థులు వివరాలు

NEET Topper: న్యూరో ఫిజీషియన్ అవుతా: ఖండవల్లి శశాంక్

Published date : 12 Nov 2021 07:54PM

Photo Stories