Skip to main content

Inspirational Success Story : కోచింగ్‌కు డ‌బ్బు లేక.. యూట్యూబ్ వీడియోల‌ను చూసి నీట్‌ ర్యాంక్ కొట్టానిలా..

ఇంటర్నెట్‌ను సరిగా ఉపయోగించుకుంటే మంచే జరుగుతుంది. కానీ, 65 శాతం జనాభా సరదా కోణంలోనే చూస్తోంది. రోజూ వాట్సాప్‌ స్టేటస్‌లు.. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఫీడ్‌లతో వేస్ట్‌ చేస్తున్న ఇంటర్నెట్‌ డేటా గణాంకాలే అందుకు నిదర్శనం.
Kashmiri Youth First Among Tribe to Crack NEET
Tufail Ahmad

అయితే.. ఇక్కడో యువకుడు అదే ఇంటర్నెట్‌ సాయంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తాను ఉంటున్న గడ్డపై ఎవరూ సాధించని ఘనత సాధించాడు.

NEET Cut Off 2022 : ఈ సారి నీట్ యూజీ-2022 కటాఫ్ మార్కులు ఇంతేనా..?

అమ్మ ఆశీర్వాదం.. యూట్యూబ్‌ సాయంతో..
జమ్ము కశ్మీర్‌ శ్రీనగర్‌కు చెందిన తుఫెయిల్‌ అహ్మద్‌ అనే యువకుడు.. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లో అర్హత సాధించాడు. జమ్ము నుంచి ఈ ఘనత సాధించిన తొలి గిరిజన వ్యక్తి తుఫెయిల్‌ కావడం విశేషం. పక్కా పల్లెటూరు.. పైగా కోచింగ్‌ స్తోమతలేని కుటుంబం ఆ యువకుడిది. అయినప్పటికీ అమ్మ ఆశీర్వాదంతో.. యూట్యూబ్‌ సాయంతో ఈ ఘనత సాధించాడు ఆ యువకుడు. అయితే ఇది కూడా అంత సులువుగా ఏం జరగలేదు. 

NEET UG 2022 All India 5th Ranker : చదివిన కొద్దిసేపైనా ఇలా చ‌దివే వాడిని.. నా ల‌క్ష్యం ఇదే..

ఇలా దాచుకున్న డబ్బుతో..
తుఫెయిల్‌ స్వగ్రామం శ్రీనగర్‌లోని ముల్నర్‌ హర్వాన్‌. పక్కా పల్లెటూరు కావడంతో ఇంటర్నెట్‌ సిగ్నల్‌ సరిగా ఉండదు. అందుకే పక్కనే ఉండే సిటీకి వెళ్లి.. యూట్యూబ్‌ వీడియోల్ని డౌన్‌లోడ్‌ చేసుకుని వచ్చేవాడు. వాటి సాయంతో మెటీరియల్‌ పొగుచేసి నీట్‌కు ప్రిపేర్‌ అయ్యాడు. కొడుక్కి సెల్‌ఫోన్‌ కొని ఇచ్చేందుకు తాను దాచుకున్న డబ్బును అందించింది ఆ తల్లి. అలా తల్లి అందించిన సహకారం.. కష్టపడి చదివి నీట్‌ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యాడు.

NEET UG 2022 Cutoff: నీట్‌ నిరాశ పరిచినా.. మరెన్నో మార్గాలు!!

ప్ర‌క్క‌న ఉన్న ఊరికి నడుచుకుంటూ వెళ్లి..

NEET Ranker

‘మా ఊర్లో సరైన కరెంట్‌, మొబైల్‌ సిగ్నల్‌ సౌకర్యాలు లేవు. అందుకే పొరుగున్న ఉన్న ఊరికి నడుచుకుంటూ వెళ్లి వీడియోలు డౌన్‌లోడ్‌ చేసుకుని వచ్చేవాడిని. ఈ నడక చిన్నతనంలో స్కూల్‌ చదువుకూ పనికొచ్చేది(రోజూ రెండు కిలోమీటర్లు స్కూల్‌ కోసం వెళ్లేవాడట). మా ఊళ్లో వైద్య సదుపాయాలు సరిగా లేవు. అందుకే డాక్టర్‌ అయ్యి ఈ ఊరికి సేవ చేయాలనుకుంటున్నా. కశ్మీర్‌ యువత మీద కొందరికి ఉన్న అభిప్రాయాన్ని చెరిపేయాలన్నది నా ఉద్దేశం. అది మా అమ్మ కోరిక కూడా ’’ అని చెప్తున్నాడు తుఫెయిల్‌.

NEET Cut Off 2022 : ఈ సారి నీట్ యూజీ-2022 కటాఫ్ మార్కులు ఇంతేనా..?

Published date : 17 Sep 2022 03:07PM

Photo Stories