Skip to main content

NEET UG 2022 All India 5th Ranker : చదివిన కొద్దిసేపైనా ఇలా చ‌దివే వాడిని.. నా ల‌క్ష్యం ఇదే..

ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ–2022 ఫలితాలు సెప్టెంబ‌ర్‌7వ తేదీన‌(బుధవారం) రాత్రి విడుద‌లైన విష‌యం తెల్సిందే.
NEET UG 2022 All India 5th Ranker
NEET UG 2022 All India 5th Ranker Errabelly Sidharth Rao

నీట్‌ యూజీ పరీక్షలను దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 17న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించారు. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 17.64 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 9,93,069 మంది (56.27 శాతం) అర్హత సాధించారు. మొత్తం ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో ఓబీసీలు 45.03%, ఎస్సీలు 13.26%, ఎస్టీలు 4.76%, జనరల్‌ 28.41%, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 8.46% మంది ఉన్నారు.

NEET UG 2022 Cutoff: నీట్‌ నిరాశ పరిచినా.. మరెన్నో మార్గాలు!!

ఏపీ నుంచి 61.77 శాతం విద్యార్థులు అర్హత సాధించారు.తెలంగాణ నుంచి 61,207 మంది పేర్లు నమోదుచేసుకోగా, పరీక్షకు 59,296 మంది హాజరయ్యారు. అందులో 35,148 మంది (59.27%) మంది అర్హత పొందారు. జాతీయ సగటుతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువమంది అర్హత సాధించారు. రాజస్థాన్‌కు చెందిన తనిష్క 715 మార్కులతో జాతీయస్థాయి తొలిర్యాంకును కైవసం చేసుకున్నారు. దిల్లీకి చెందిన వత్సా ఆశిష్‌ బాత్రా రెండవ స్థానం పొందాడు.

నీట్ యూజీ-2022 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

NEET UG 2022 Results (click here)

చదివిన కొద్దిసేపైనా ఇలా చ‌దివే వాడిని.. నా ల‌క్ష్యం ఇదే..

NEET UG 2022 Ranker


నీట్ యూజీ 2022 ఫ‌లితాల‌ల్లో ఆల్‌ ఇండియా అయిదో ర్యాంకు, తెలంగాణ మొదటి ర్యాంక్(711 మార్కులు) సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు ఎర్రబెల్లి సిద్ధార్థరావు. మాది కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం సురారం గ్రామం. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఉండి చదువుకుంటున్నా. మా నాన్న హనుమంతరావు వ్యాపారి. అమ్మ లావణ్య గృహిణి. శ్రీ చైతన్యలో అధ్యాపకులు బాగా సహకరించారు. ఎప్పుడు ఏ చిన్న సందేహం వచ్చినా పరిష్కారం చూపేవారు.

చదవండి: NEET 2022 Question Paper with Key : నీట్‌-2022 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' కోసం క్లిక్ చేయండి.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

గంటలు గంటలు చదివేవాడిని కాదు. చదివిన కొద్దిసేపైనా ఏకాగ్రతతో సాధన చేసేవాడిని. ఫిజిక్స్‌లో తొలుత కొంచెం వెనుకబడ్డా. తర్వాత పుంజుకున్నా. టాప్‌-5లో ఉంటానని ఊహించలేదు. దిల్లీ ఎయిమ్స్‌లో చేరడమే లక్ష్యం. కార్డియాలజిస్ట్‌గా సేవలందిస్తా. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తా. తిరిగొచ్చి ఇక్కడ పేదలకు సేవలందిస్తాన‌న్నారు.

NEET UG 2022 Toppers : నీట్ యూజీ 2022 ఫలితాలు విడుద‌ల‌.. టాప‌ర్స్ వీరే..ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

Published date : 08 Sep 2022 03:15PM

Photo Stories