NEET 2022 Question Paper with Key : నీట్-2022 కొశ్చన్ పేపర్ & 'కీ' కోసం క్లిక్ చేయండి.. ఈ సారి ప్రశ్నలు ఎలా వచ్చాయంటే..?
ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరిగిన విషయం తెల్సిందే. గతేడాది మూడు గంటలున్న పరీక్షను ఈసారి మరో 20 నిమిషాలు అదనంగా పెంచారు. దేశవ్యాప్తంగా 546 నగరాల్లోతో పాటు.., విదేశాల్లో 14 నగరాల్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-2022 (నీట్) పరీక్షను ఎన్‌టీఏ నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా నీట్‌ను ఇంగ్లిష్, హిందీతో పాటు మరో పదకొండు భాషల్లో అంటే మొత్తం 13 భాషల్లో నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అనుకూలంగా ఉండే తెలుగు, ఉర్దూ భాషల్లోనూ ఈ పరీక్షను నిర్వహించారు. గత ఏడాది మొత్తం 180 ప్రశ్నలకు నీట్ నిర్వహించారు. ఈ సారి మాత్రం 200 ప్రశ్నలకు నీట్ పరీక్షను నిర్వహించారు. మొత్తం మార్కులు 720. జూలై 17వ (ఆదివారం) జరిగిన నీట్-2022 పరీక్ష 'కీ' ని సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com) ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించింది. ఇది అభ్యర్థులకు అవగాహన కోసం ప్రిపేర్ చేయించారు. అంతిమంగా ఎన్‌టీఏ విడుదల చేసిన 'కీ' నే ప్రమాణికంగా తీసుకోగలరు. తెలంగాణ నుంచి దాదాపు 55 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు ఈ పరీక్షకు హాజరయ్యారు. అలాటే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం దాదాపు 60 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.