Skip to main content

NEET UG 2022 Toppers : నీట్ యూజీ 2022 ఫలితాలు విడుద‌ల‌.. టాప‌ర్స్ వీరే..ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్‌: నీట్ యూజీ 2022 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సెప్టెంబరు 7వ తేదీ రాత్రి విడుద‌ల చేసింది.
NEET UG 2022 Results
NEET UG 2022 Topper Tanishka

ఈ నీట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అలాగే నీట్ ఫలితాలతోపాటు తుది కీని కూడా ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. NEET UG 2022 ప‌రీక్ష జూలై 27వ తేదీన నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.

NEET UG 2022 Cutoff: నీట్‌ నిరాశ పరిచినా.. మరెన్నో మార్గాలు!!

నీట్ యూజీ ఫ‌లితాలను చేక్ చేసుకోండిలా..
నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఆయా వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. అలాగే విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు.

నీట్ యూజీ-2022 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

NEET UG 2022 Results (click here)

How to check NEET UG 2022 Results?

  • Visit NEET official website neet.nta.nic.in
  • Click on NEET UG 2022 Results link on the home page
  • In the next page, enter your hall ticket number and date of birth and submit
  • The results will be displayed
  • Download a copy of the rank sheet for further reference

చదవండి: NEET 2022 Question Paper with Key : నీట్‌-2022 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' కోసం క్లిక్ చేయండి.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

టాప్-10 ర్యాంకర్లు.. మార్కుల వివ‌రాలు ఇలా..
నీట్ యూజీ 2022 ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన తనిష్క మొదటి ర్యాంకు సాధించ‌గ‌, దిల్లీకి చెందిన వత్స ఆశీష్ బాత్రాకు రెండో ర్యాంకు వచ్చింది. అలాగే తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థ్‌ రావు ఐదో ర్యాంకు (711 మార్కులు)తో మెరిశాడు.‌ యూపీ, మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది అర్హత సాధించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. 710 మార్కుల‌తో ఏపీకి చెందిన మ‌ట్టా దుర్గా సాయి కీర్తీ 12వ ర్యాంక్ సాధించింది.

టాప్-10 ర్యాంకర్లు వీరే..:
1. తనిష్క (రాజస్థాన్) - 715 మార్కులు
2. వత్స ఆశీష్ బాత్రా (దిల్లీ)  - 715 మార్కులు
3. హృషికేశ్ నాగ్భూషణ్ గంగూలే (కర్ణాటక) - 715 మార్కులు 
4. రుచా పవాశి (కర్ణాటక) - 715 మార్కులు
5. ఎర్రబెల్లి సిద్ధార్థ్ రావు (తెలంగాణ) - 711 మార్కులు
6. రిషి వినయ్ బాల్సే (మహారాష్ట్ర) - 710 మార్కులు
7. అర్పిత నారంగ్ (పంజాబ్) - 710 మార్కులు
8. కృష్ణ ఎస్ఆర్ (కర్ణాటక) - 710 మార్కులు
9. జీల్ విపుల్ వ్యాస్ (గుజరాత్) - 710 మార్కులు
10. హాజిక్ పర్వీజ్ లోన్ (జమ్మూకశ్మీర్) - 710 మార్కులు

NEET 2022 Question Paper with Key : నీట్‌-2022 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' కోసం క్లిక్ చేయండి.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

ఎంత‌ శాతం ఉత్తీర్ణ‌త సాధించారంటే..?
నీట్ యూజీ పరీక్షకు మొత్తం 18,72,343 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 17,64,571 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 9,93,069 లక్షల మంది అర్హత సాధించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించినవారిలో 4,29,160 మంది బాలిక‌లు, 5,63,902 మంది బాలురు, ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. మొత్తం 56.27 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు. 

ఏపీ, తెలంగాణ‌ నుంచి..
ఏపీ, తెలంగాణ‌కు సంబంధించి మొత్తం 75,492 (59.67 %) మంది విద్యార్థులు నీట్ పరీక్షలో అర్హత సాధించారు. వీరిలో ఏపీ నుంచి 40,344 మంది, తెలంగాణ నుంచి 35,148 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రెండు రాష్ట్రాల నుంచి 1,29,268 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1,26,512 మంది పరీక్షకు హాజరయ్యారు. The cutoff for OBC, SC, and ST dropped from 137-108 in 2021 to 116-93. The range of qualifying marks i e., cutoff marks dropped to 715-117 when compared to 2021, 720- 138 for OC and EWS candidates. Similarly, the cutoff was dropped for other categories too.

వీరిలో ఏపీ నుంచి 68,061 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 65,305 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 40,344 మంది పరీక్షలో అర్హత సాధించారు. ఇక తెలంగాణ నుంచి 61,207 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 59,296 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 35,148 మంది నీట్ పరీక్షలో అర్హత సాధించారు.

Published date : 08 Sep 2022 09:28AM

Photo Stories