Skip to main content

253 Assistant‌ Commandant‌ Jobs: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ ఎగ్జామ్‌.. ఎంపిక విధానం ఇలా..

UPSC Central Armed Police Force Exam

కేంద్ర సాయుధ బలగాలైన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్స్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ), శస్త్ర సీమాబల్‌(ఎస్‌ఎస్‌బీ)ల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ ఎగ్జామ్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

పోస్టులు: అసిస్టెంట్‌ కమాండెంట్‌
మొత్తం పోస్టుల సంఖ్య: 253(బీఎస్‌ఎఫ్‌–66, సీఆర్‌పీఎఫ్‌–29, సీఐఎస్‌ఎఫ్‌–62, ఐటీబీపీ–14, ఎస్‌ఎస్‌బీ 82)
అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ/తత్సమాన అర్హత ఉండాలి. 2022లో డిగ్రీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
వయసు: ఆగస్టు1, 2022 నాటికి 20 ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తుకు అర్హులే.


చదవండి:  UPSC Recruitment 2022: 687 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌/ఎఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.04.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.05.2022
పరీక్ష తేది: 07.08.2022

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in
 

చదవండి:  Competitive Exams Preparation Tips: కోచింగ్‌ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్‌!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 10,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories