UPSC Recruitment 2022: 687 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. 2022 సంవత్సరానికి సంబంధించి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 687
కేటగిరి–1: సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లో జీడీఎంవో పోస్టులు–314.
కేటగిరి–2: అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వే)–300, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్(న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్)–03, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్2 (ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్)–70.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి. చివరి ఏడాది ఎంబీబీఎస్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.08.2022 నాటికి 32 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.04.2022
సీఎంఎస్‌ఈ–2022 పరీక్ష తేది: 17.07.2022
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
వెబ్‌సైట్: https://upsconline.nic.in
చదవండి: Competitive Exams Preparation Tips: కోచింగ్ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 26,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |