Skip to main content

UPSC CDS Exam 2023: 349 డిఫెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్ ఇదే..

బ్యాచిలర్‌ డిగ్రీ అభ్యర్థులకు సువర్ణావకాశం. భద్రతా దళాల్లో కెరీర్‌కు బంగారు బాట వేసే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీడీఎస్‌ఈ)కు యూపీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపిక ప్రక్రియలో విజేతగా నిలిస్తే.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో పర్మనెంట్‌ కమిషన్‌ ర్యాంకుతో ఆఫీసర్‌గా కొలువుదీరొచ్చు. ఇటీవల సీడీఎస్‌ఈ(2)-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. సీడీఎస్‌ఈ ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
upsc cds 2 2023 notification and exam pattern
  • 349 పోస్ట్‌లతో సీడీఎస్‌ఈ(2)-2023 నోటిఫికేషన్‌ విడుదల
  • డిగ్రీ అర్హతతో భద్రతా దళాల్లో పర్మనెంట్‌ ర్యాంకు పోస్ట్‌
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక 

మొత్తం 349 పోస్ట్‌లు

  • సీడీఎస్‌ పరీక్ష ద్వారా త్రివిధ దళాలకు చెందిన అయిదు విభాగాల్లోని మొత్తం 349 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. అవి.. 
  • ఇండియన్‌ మిలటరీ అకాడమీ(డెహ్రాడూన్‌) 157వ డైరెక్ట్‌ ఎంట్రీ కోర్స్‌: 100
  • ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఎజిమలా) ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌)/హైడ్రో బ్రాంచ్‌: 32
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ(హైదరాబాద్‌) ప్రీ-ఫ్లయింగ్‌: 32.
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(చెన్నై) ఎస్‌ఎస్‌సీ-120(పురుషులు): 169
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(చెన్నై) ఎస్‌ఎస్‌సీ -34(మహిళలు): 16

చ‌ద‌వండి: UPSC CDS Exam 2023: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుల్లో 349 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా‌..

అర్హత

  • ఇండియన్‌ మిలటరీ అకాడమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
  • ఇండియన్‌ నేవల్‌ అకాడమీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్‌ ఉత్తీర్ణత సాధించాలి.
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్‌ చదివుండాలి.
  • ఆయ కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దీంతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి.

వయసు

  • ఇండియన్‌ మిలటరీ అకాడమీ: జూలై 2, 2000-జూలై 1, 2005 మధ్య జన్మించి ఉండాలి.
  • నేవల్‌ అకాడమీ: జూలై 2, 2000- జూలై 1, 2005 మధ్య జన్మించి ఉండాలి.
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ: జూలై 2, 2000- జూలై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి(డీజీసీఏ కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉన్న వారికి రెండేళ్ల సడలింపు లభిస్తుంది). 
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ: జూలై 2, 1999 - జూలై 1, 2005 మధ్య జన్మించి ఉండాలి.

రెండంచెల ఎంపిక ప్రక్రియ

ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీల్లోని ఆఫీసర్‌ పోస్ట్‌లకు రెండంచెల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ముందుగా యూపీఎస్‌సీ.. సీడీఎస్‌ రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు సాధించి మెరిట్‌ జాబితాలో నిలిస్తే..మలి దశ ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియకు అర్హత లభిస్తుంది.

చ‌ద‌వండి: 395 Jobs in UPSC: యూపీఎస్సీ–ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ (2)–2023 నోటిఫికేషన్‌ విడుదల..

రాత పరీక్ష ఇలా

  • తొలి దశలో సీడీఎస్‌ఈ రాత పరీక్ష ఉంటుంది. ఇండియన్‌ మిలటరీ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ తరహాలో జరిVó రాత పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు. 
  • ఇండియన్‌ మిలటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ: వీరికి ఇంగ్లిష్, జన రల్‌ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌.. ఇలా ఒక్కో విభాగానికి 100 మార్కులకు చొప్పును మొత్తం 300మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి విభాగానికి పరీక్ష సమయం 2 గంటలు. 
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ పరీక్షలో ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి వంద మార్కులు చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఒక్కో విభాగానికి పరీక్ష సమయం రెండు గంటలు. 

ఎస్‌ఎస్‌బీ ప్రక్రియకు 300 మార్కులు

  • తొలి దశ రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులకు మలి దశలో ఆయా సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌లు 300 మార్కులకు ప్రత్యేక ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తాయి.
  • మొదటి దశలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే..స్టేజ్‌-2కు అనుమతిస్తారు. స్టేజ్‌-1లో ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్‌ రేటింగ్‌(ఓఐఆర్‌) టెస్ట్‌లు, స్టేజ్‌-2లో సైకాలజీ టెస్ట్‌లు, గ్రూప్‌ టెస్టింగ్‌ టాస్కులు, ఇంటర్వ్యూలు, కాన్ఫరెన్స్‌లు ఉంటాయి.వీటిని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు. స్టేజ్‌-1, స్టేజ్‌-2ల తర్వాత వర్డ్‌ అసోసియేషన్‌ టెస్ట్‌(డబ్ల్యూఏటీ), సిట్యుయేషన్‌ రియాక్షన్‌ టెస్ట్‌(ఎస్‌ఆర్‌టీ)ల ద్వారా అభ్యర్థుల సమయస్ఫూర్తిని పరీక్షిస్తారు. చివరగా సెల్ఫ్‌ డిస్క్రిప్షన్‌ టెస్ట్‌(ఎస్‌డీ)లో అభ్యర్థి తన కుటుంబం, స్నేహితులు, కాలేజీ, ఉపాధ్యాయుల గురించి రాయాలి. ఈ టెస్టుల తర్వాత రెండు రోజుల పాటు 9 రకాల గ్రూప్‌ టాస్క్‌లు నిర్వహిస్తారు.

పర్సనల్‌ ఇంటర్వ్యూ

రాత పరీక్ష, ఆ తర్వాత ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియల్లో విజయం సాధించిన వారికి చివరగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలోనే ఒక ప్రక్రియగా.. కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ వారికి పీఏబీటీ ఉంటుంది. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిస్ట్‌ లిస్ట్‌ రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు సాధించుకున్న వారికి మరోసారి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి.. ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేస్తారు.

శిక్షణ, స్టయిఫండ్‌

ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్‌ మిలటరీ అకాడెమీ(డెహ్రాడూన్‌)లో 18 నెలలు; నేవల్‌ అకాడెమీలో సుమారు 17 నెలలు; ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీలో 18 నెలలు; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీలో 11 నెలలు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టైపెండ్‌ అందిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్ట్‌నెంట్‌ హోదాలో పర్మనెంట్‌ కొలువు సొంతమవుతుంది. నేవీలో మాత్రం ప్రారంభంలో సబ్‌-లెఫ్ట్‌నెంట్‌ హోదా లభిస్తుంది. ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ పొందిన వారు ప్రా­రంభంలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా విధుల్లో చేరతారు. 

చ‌ద‌వండి: Civils Prelims Guidance

విజయం సాధించాలంటే
ఇంగ్లిష్‌

ఈ విభాగంలో రాణించాలంటే.. ఇంగ్లిష్‌ భాషపై పట్టు పెంచుకోవాలి. యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్, ఆర్డరింగ్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, ప్యాసేజ్‌లు, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, క్టోజ్‌ టెస్టు, ఫిల్‌అప్స్, అనాలజీస్‌ సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

జనరల్‌ నాలెడ్జ్‌

ఈ విభాగంలో మంచి మార్కుల కోసం కరెంట్‌ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్‌ పాలిటీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితరాలపై పట్టు సాధించాలి. డిఫెన్స్‌కు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు, ప్రాముఖ్యం ఉన్న అంశాలు, అవార్డులు, సంయుక్త సైనిక విన్యాసాలు-పాల్గొన్న దేశాల గురించి తెలుసుకోవాలి. కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌

ఈ విభాగంలో మెరుగైన మార్కుల కోసం.. పదో తరగతి స్థాయి గణితంపై దృష్టి సారించాలి. టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రాబబిలిటీ, వాల్యూమ్‌ అండ్‌ సర్ఫేస్‌ ఏరియా, లీనియర్‌ అండ్‌ క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, ట్రిగనామెట్రీ, ఫ్యాక్టరైజేషన్‌ తదితర చాప్టర్లపై పట్టు సాధించాలి.

చ‌ద‌వండి: Civils Prelims Study Material

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 6, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: జూన్‌ 7-జూన్‌ 13, 2023
  • సీడీఎస్‌ఈ(2)-2023 పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 3, 2023
  • వెబ్‌సైట్‌: https://upsconline.nic.in, www.upsc.gov.in
Qualification GRADUATE
Last Date June 06,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories